PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanic024acea-449a-45ba-9461-6f02b973b85c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanic024acea-449a-45ba-9461-6f02b973b85c-415x250-IndiaHerald.jpgవైసీపీ మంత్రి కొడాలి నాని నోరు తెలిస్తే.. ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఆయన మహా నాటు భాష మాట్లాడతారు. పైగా అలా మాట్లాడటం ఏమాత్రం తప్పకాదన్నట్టు ప్రవర్తిస్తారు. ఏం మంత్రి అయితే ఇలా మాట్లాడకూడదా అన్నట్టు చూస్తారు. ఎప్పటి నుంచో అలవాటైన మాట తీరు మంత్రి పదవి రాగానే మాత్రం మారుతుందా.. అదీ నిజమే.. అయితే ఆ పరుష పదజాలం ఇతర పార్టీల వారిని తిట్టేటప్పుడు కూడా ఉపయోగిస్తే ఏం బావుంటుంది.. బాగోదు.. కానీ.. మరేం పర్లేదు అలాగే తిట్టొచ్చనుకుంటారు కొడాలి నాని. అందుకే టీడీపీ నేతలపై తరచూ నోరు చేసుకుంటారు. అయితేkodali-nani;nani;kodali nani;devineni avinash;minister;tdp;ycp;maha;sajjala ramakrishna reddyకొడాలి నాని బూతులు కూడా.. మహా కమ్మగా ఉన్నాయట..!?కొడాలి నాని బూతులు కూడా.. మహా కమ్మగా ఉన్నాయట..!?kodali-nani;nani;kodali nani;devineni avinash;minister;tdp;ycp;maha;sajjala ramakrishna reddyWed, 20 Jan 2021 10:00:00 GMTవైసీపీ మంత్రి కొడాలి నాని నోరు తెలిస్తే.. ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఆయన మహా నాటు భాష మాట్లాడతారు. పైగా అలా మాట్లాడటం ఏమాత్రం తప్పకాదన్నట్టు ప్రవర్తిస్తారు. ఏం మంత్రి అయితే ఇలా మాట్లాడకూడదా అన్నట్టు చూస్తారు. ఎప్పటి నుంచో అలవాటైన మాట తీరు మంత్రి పదవి రాగానే మాత్రం మారుతుందా.. అదీ నిజమే.. అయితే ఆ పరుష పదజాలం ఇతర పార్టీల వారిని తిట్టేటప్పుడు కూడా ఉపయోగిస్తే ఏం బావుంటుంది.. బాగోదు.. కానీ.. మరేం పర్లేదు అలాగే తిట్టొచ్చనుకుంటారు కొడాలి నాని.

అందుకే టీడీపీ నేతలపై తరచూ నోరు చేసుకుంటారు. అయితే పోనీలే.. అదే నాని మాట తీరు.. ఏం చేద్దామని సరిపెట్టుకోవచ్చు..కానీ.. ఆయన ఒక్కరే కాదు.. ఆయన పార్టీలోని కీలక సభ్యులు కూడా కొడాలి నాని తీరును సమర్థించడం చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. దేవినేని ఉమకు తన్నులు తప్పవన్న తిట్లను.. ఇతర పరుష పదజాలాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమర్థించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కొడాలి నాని దేవినేని ఉమాను కొడతానని అన్న వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఒక్కొక్కరు తాము ఆగ్రహంతో ఉన్నామని చెప్పే విధానాన్ని ఒక్కోలా వెల్లడిస్తుంటారని వెనకేసుకొచ్చారు. ఎవరు మాట్లాడినా పరుషంగా, ఇంకోరకంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. అవతల వారికి ఎంత చెప్పినా అవతల వాళ్లు వినకపోతే వచ్చే ఆవేశంలో ఒక్కొక్కరు చెప్పే భాష విధానంలో తేడా ఉంటుందట. కొడాలి నాని భాషలో తనకు అదే కనపడిందంటున్నారు  సజ్జల.

అంతే కాదు.. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు .. ప్రతిరోజూ అబద్దాలే చెబుతూ వాటిని నిజం చేయాలనుకుంటే .. ముతక భాషలో కొడాలి నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేగానీ.. మా మంత్రిగారి మాటలు బాగాలేవని మాత్రం అనడం లేదు సజ్జల. పైగా.. ఈయన వెళ్లి కొట్టేది లేదు.. ఆయన వచ్చి డొక్క తీసేది ఉండదని సజ్జల చెబుతున్నారు.  అంతే కాదు..పైగా రాజకీయంగా టీడీపీ వారు వాడుతున్న భాష కూడా సరిగా లేదని సజ్జల అంటున్నారు. ఇలాంటి భాషకు టీడీపీనే బాధ్యత వహించాలట. 


పవన్ కళ్యాణ్ సరసన అనసూయ...?

బీజేపీని ఓడించేందుకు పద్మవ్యూహం.. అందరూ కలిసి..

"ఈనాడు"-"ఆంధ్రజ్యోతి".. "సాక్షి"గా.. జగన్‌ సర్కారుకు వాతలు..!?

జగన్ కు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు..??

ఇన్‌సైడర్ కుట్ర లేదట.. మరిప్పుడేమంటారో ?

బాబోయ్.. చైనా మరోసారి ప్రపంచాన్ని ముంచేయబోతోందా..?

రామతీర్థం విగ్రహాల ప్రత్యేకతలు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>