PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu7eac3d7a-0628-4469-ac09-b73683cef84c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu7eac3d7a-0628-4469-ac09-b73683cef84c-415x250-IndiaHerald.jpgప్రజల ప్రాణాలు తీయడమే వైసిపి నిత్యకృత్యమైంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, అత్యాచారాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని అన్నారు. 20నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు, 16మంది టిడిపి కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 400మంది మహిళలపై అఘాయిత్యాలు....తంబళ్లపల్లిలో గంగిరెడ్డి హత్య, పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి అని మండిపడ్డారు. నిన్న సుళ్లూరుపేటలో టిడిపి నాయకుడు వెంకటేష్ పై chandrababu;venkatesh;amarnath cave temple;janasena;district;mla;minister;police station;murder.;tdp;traffic police;ycp;janasena party;punganur;gandikota;mantraగుడివాడ ఎస్సై ఆత్మహత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుగుడివాడ ఎస్సై ఆత్మహత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుchandrababu;venkatesh;amarnath cave temple;janasena;district;mla;minister;police station;murder.;tdp;traffic police;ycp;janasena party;punganur;gandikota;mantraWed, 20 Jan 2021 09:15:47 GMTవైసిపి నిత్యకృత్యమైంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, అత్యాచారాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని అన్నారు.  20నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు, 16మంది టిడిపి కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  400మంది మహిళలపై అఘాయిత్యాలు....తంబళ్లపల్లిలో గంగిరెడ్డి హత్య, పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి అని మండిపడ్డారు.

నిన్న సుళ్లూరుపేటలో టిడిపి నాయకుడు వెంకటేష్ పై 15మంది కత్తులతో దాడి  చేసారని అన్నారు. ప్రశాంతమైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా హింసా విధ్వంసాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేశారు. ఉన్మాదుల రాజ్యంగా మార్చారు అని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను రాష్ట్రచరిత్రలో చూడలేదు అని అన్నారు.  వీళ్లా మంత్రులు, వీళ్లా ఎమ్మెల్యేలు అని ప్రజలే నిలదీస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలోనే బెదిరిస్తాడు, తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తాడు అని అన్నారు.

ఇంకో ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఏకంగా మహిళా ఎంపిడివో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ధర్నా చేయడం,  మరో ఎమ్మెల్యే తన ఆక్రమణలో 7ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నిస్సిగ్గుగా చెప్పడం, ఈ రోజు బూతుల మంత్రి, ప్రతిపక్ష నాయకుడిని ఇంటికొచ్చి తంతాననడం...వైసిపి రౌడీ రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. గుడివాడలో మంత్రి పేకాట దందా పట్టుకున్న ఎస్సై ఆత్మహత్య...అది ఆత్మహత్యనా, హత్యనా, అనుమానాస్పద మరణమా..?  అని ఆయన నిలదీశారు. ఇళ్లస్థలాల్లో అవినీతిని బైటపెట్టిన చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను పిలిపించి ఇళ్లస్థలాల ప్రాంగణంలోనే హత్య చేయడం అని చంద్రబాబు మండిపడ్డారు. గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలు బైటపెట్టిన కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని గ్రామ సభ జరిగిన గుళ్లోనే హతమార్చడం జరిగిందని అన్నారు. రోడ్లు వేయలేదని గిద్దలూరు ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త అనుమానాస్పద మరణం అని ఆయన ఆరోపించారు.


కేసీఆర్ చాలా హ్యాపీ

టీడీపీలో జరిగిందే వైసీపీలో జరుగుతుందా...?

కేటీఆర్ సీఎం కావడం ఖాయమే!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>