MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-malineni-super-hit-to-krack7fc9ce8a-7162-4b45-ba84-61208bc52d8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-malineni-super-hit-to-krack7fc9ce8a-7162-4b45-ba84-61208bc52d8a-415x250-IndiaHerald.jpgక్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని కి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ మలినేని కి క్రాక్ సినిమా బంపర్ హిట్ గా నిలవడంతో ఒక్కసారి గా ఆయనకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ డైరెక్టర్ గా తన డైరెక్షన్ తో అందరికి క్రాక్ తెప్పించిన గోపీచంద్ ఒక్క సినిమా తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.. తొలి సినిమా డాన్ శ్రీను తోనే తన లోని మాస్ ఎలివేషన్స్ ని ప్రపంచానికి చూపించిన గోపీచంద్ సరైన కథలు ఎంపిక చేసుకోకా ఇన్నిరోజులు వెనుకపడిపోgopichand;ravi;venkatesh;gopichand;ram pothineni;ravi teja;cinema;tamil;blockbuster hit;remake;director;winner;hero;vegetable market;winner1;mythri movie makers;wanted;mass;krackగోపీచంద్ మలినేని కి అడ్వాన్స్ ఇచ్చిన భారీ నిర్మాణ సంస్థ..?గోపీచంద్ మలినేని కి అడ్వాన్స్ ఇచ్చిన భారీ నిర్మాణ సంస్థ..?gopichand;ravi;venkatesh;gopichand;ram pothineni;ravi teja;cinema;tamil;blockbuster hit;remake;director;winner;hero;vegetable market;winner1;mythri movie makers;wanted;mass;krackWed, 20 Jan 2021 23:00:00 GMTక్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని కి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ మలినేని కి క్రాక్ సినిమా బంపర్ హిట్ గా నిలవడంతో ఒక్కసారి గా ఆయనకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ డైరెక్టర్ గా తన డైరెక్షన్ తో అందరికి క్రాక్ తెప్పించిన గోపీచంద్ ఒక్క సినిమా తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు..   తొలి సినిమా డాన్ శ్రీను తోనే తన లోని మాస్ ఎలివేషన్స్ ని ప్రపంచానికి చూపించిన గోపీచంద్ సరైన కథలు ఎంపిక చేసుకోకా ఇన్నిరోజులు వెనుకపడిపోయాడు..

మధ్య లో బలుపు సినిమా తో హిట్ కొట్టినా ఆ తరువాత వరుస ఫ్లాప్ సినిమాలు చేయడంతో గోపీచంద్ ఢీలా పడిపోయాడు. అయితే ఈ సారి హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని తనకు అచ్చోచ్చిన రవితేజ తో క్రాక్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. నిజానికి గోపీచంద్ తాను మాత్రమే గాడిలో పడడమే కాదు రవితేజ ను కూడా గాడిలోపెట్టాల్సిన అవసరం ఉంది.. తన ఉనికిని గట్టిగా చాటుకోవాల్సిన అవసరంతో పాటు నాలుగు డిజాస్టర్లతో మార్కెట్ డౌన్ లో ఉన్న రవితేజకు బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యతను ఒకేసారి మోయాల్సి వచ్చింది. ఇన్ని కండిషన్స్ మధ్య సినిమా చేసిన గోపీచంద్ కష్టానికి ప్రతిఫలం దక్కింది.

ఒక్కసారిగా రవితేజ పనైపోయిందనుకున్న వాళ్లకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. గోపీచంద్ మలినేని వెనుక మళ్ళీ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అయితే తనకు ఇక్కడో కొత్త ఛాలెంజ్ ఉంది. ఇతను ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఆరు. అందులో డాన్ శీను, బలుపు , క్రాక్ మూడూ మాస్ మహారాజా రవితేజతో హిట్టు కొట్టినవి. మిగిలిన వాటిలో వెంకటేష్ తో చేసిన తమిళ రీమేక్ బాడీ గార్డ్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రామ్ తో తీసిన పండగ చేస్కో సోసో కమర్షియల్ పాస్ అనిపించుకుంది తప్ప మరీ గొప్పగా అయితే ఆడలేదు. ఇక సాయి తేజ్ విన్నర్ గురించి చెప్పాల్సిన పని లేదు. డిజాస్టర్ ఫలితం అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన గోపిచంద్ రవితేజ కాకుండా ఇంకో హీరోతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఉంది. తాజాగా వచ్చిన అప్ డేట్ మేరకు మైత్రి మూవీ మేకర్స్ లో డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. హీరో ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. 


బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్న మాస్ రాజా!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>