LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthy-food072d5419-c641-4993-a8a2-8b3306d900f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthy-food072d5419-c641-4993-a8a2-8b3306d900f2-415x250-IndiaHerald.jpgమారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం తో పాటుగా ఆహారపు అలవాట్లు కూడా మనిషి జీవితం పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే తినే పద్దతులు కూడా చాలా మారిపోయాయి. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రకాలా పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం.. healthy food;jeevitha rajaseskhar;samatha;iron;vitamin;heart;sugar;green teaవీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..healthy food;jeevitha rajaseskhar;samatha;iron;vitamin;heart;sugar;green teaWed, 20 Jan 2021 19:00:00 GMT

గ్రీన్ టీ..


గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి కాలేయం పనితీరును పెంచుతాయి. మచ్చా టీ క్యాన్సర్‌ తో పోరాడటానికి సహాయ పడుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


క్యాబేజీ..

క్యాబేజీలో రసాయన సల్ఫోరాఫేన్ ఉండి శరీరంలోని విషాలతో పోరాడటానికి సహాయ పడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథియోన్ కాలేయ పనితీరును పెంచుతుంది. ప్రేగు పని తీరును ప్రోత్సహించడం తో పాటు జీర్ణక్రియకు సహాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. 


బీట్ రూట్..

బీట్‌రూట్‌ పెద్ద మొత్తం లో ఫైబర్ కలిగివుండి.. కాలేయం లోని యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. కాలేయం, పిత్తాశయంలోని అదనపు పిత్తాన్ని తొలగించడానికి సహాయ పడతాయి. బీట్‌రూట్‌ లో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సీ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి.


వీటితో పాటుగా ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో, తేనె నిమ్మరసం వేసుకొని తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆకుకూరలు కూడా శరీరానికి మంచి మేలును చేస్తాయి. నిమ్మ, ఆరెంజ్‌ పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి విటమిన్ సీ తో నిండివుంటాయి. శరీరాన్ని దెబ్బతీసే ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. వీటిలోని ఆల్కలైన్ శరీరం యొక్క పీహెచ్‌ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా బలంగా చేస్తుంది. చూసారుగా వీటిని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..





రేవంత్ రెడ్డికి కేటీఆర్ భయపడ్డారా!

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>