MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saipallavai-selected-as-finalist441f9270-30b2-4a1d-b51e-9371ecb02687-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saipallavai-selected-as-finalist441f9270-30b2-4a1d-b51e-9371ecb02687-415x250-IndiaHerald.jpgస్టార్‌ హీరో మూవీ అయినా... యంగ్ హీరో సినిమా అయినా.. అందులో చెల్లిపాత్రైనా.. హీరోయిన్‌ రోల్ అయినా.. ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయిపల్లవి. ప్రతి పాత్ర ఈ అమ్మడి చుట్టూనే తిరుగుతోంది గానీ.. ఆమె మాత్రం సెట్‌ కావడం లేదు. లేటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం టైటిల్‌ రోల్‌ పోషిస్తోందట. తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య సాయిపల్లవి చుట్టూనే తిరుగుతోంది. అలాగని.. చేతిలో మూడు నాలుగు సినిమాలు కూడా లేవు. రిలీజ్‌కు రెడీగా ఉన్న లవ్ ‌స్టోరీతోపాటు.. నాతో జత కడుతున్న 'శ్యాం సింగరాయ్‌' సెట్స్‌పై ఉంది. మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్saipallavai selected as finalist;chiranjeevi;rana;anoushka;allu arjun;teja;tiru;cinema;media;love;industry;hero;heroine;tapsee pannu;sai pallaviఫైనల్ గా సాయిపల్లవి సెలక్ట్ అయిందా..?ఫైనల్ గా సాయిపల్లవి సెలక్ట్ అయిందా..?saipallavai selected as finalist;chiranjeevi;rana;anoushka;allu arjun;teja;tiru;cinema;media;love;industry;hero;heroine;tapsee pannu;sai pallaviWed, 20 Jan 2021 21:00:00 GMTహీరో మూవీ అయినా... యంగ్ హీరో సినిమా అయినా.. అందులో చెల్లిపాత్రైనా.. హీరోయిన్‌ రోల్ అయినా.. ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయిపల్లవి. ప్రతి పాత్ర ఈ అమ్మడి చుట్టూనే తిరుగుతోంది గానీ.. ఆమె మాత్రం సెట్‌ కావడం లేదు. లేటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం టైటిల్‌ రోల్‌ పోషిస్తోందట.

తెలుగు  ఇండస్ట్రీ ఈ మధ్య సాయిపల్లవి చుట్టూనే తిరుగుతోంది. అలాగని.. చేతిలో మూడు నాలుగు సినిమాలు కూడా లేవు. రిలీజ్‌కు రెడీగా ఉన్న లవ్ ‌స్టోరీతోపాటు.. నాతో జత కడుతున్న 'శ్యాం సింగరాయ్‌' సెట్స్‌పై ఉంది. మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వకపోయినా.. ప్రతి సినిమాలో ముందుగా ఈ అమ్మడి పేరు బయటకు రావాల్సిందే.

మెగా హీరోలకు చెల్లెలుగా.. హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప మూవీలో బన్నీ చెల్లెలుగా... లూసిఫర్‌లో చిరంజీవి సిస్టర్‌గా ముందు ఈ అమ్మడు పేరే వినిపించింది. నిజమో.. గాసిప్సోగానీ అయ్యప్పనమ్‌ కోషియమ్‌ తెలుగు రీమేక్‌లో పవన్‌ భార్యగా కూడా  ఈ హైబ్రీడ్‌ పిల్ల పేరు తెరపైకి వచ్చింది.

ఇలా సాయిపల్లవి పేరు మీడియా తిరిగి మాయమైపోతోంది. లేటెస్ట్ న్యూస్‌  ఏమంటే.. తేజ దర్శకత్వంలో నటిస్తోందట. తేజ ఏడాది క్రితమే.. 'అలివేలు మంగ వేంకటరమణ'... 'రాక్షసరాజు.. రావణాసురుడు' పేరుతో రెండు సినిమాలు ఎనౌన్స్‌ చేశాడు. వేంకటరమణగా గోపీచంద్‌.. రావణాసురుడుగా రానా నటిస్తారని ప్రకటించారు. గోపీచంద్‌ సరసన అలివేలు మంగగా సాయిపల్లవి నటిస్తోందట. ఈరోల్‌  కీర్తిసురేష్‌.. అనుష్క.. కాజల్‌ .. తాప్సి చుట్టి తిరిగి సాయిపల్లవి దగ్గరకు చేరింది. మరి ఇది కూడా ఉత్తుత్తి న్యూసేనా? లేదంటే.. అలివేలు మంగ అవతారం ఎత్తుతుందో చూడాలి మరి.

మొత్తానికి సాయిపల్లవి క్రేజ్ రోజురోజుకూ తెగ పెరిగిపోతోంది. ఇక తేజ సినిమా అలివేలుమంగ వేంకటరమణలో సాయిపల్లవి హీరోయిన్ గానటిస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాజల్‌.. అనుష్క.. తాప్సీ చుట్టూ తిరిగిన అలివేలు మంగ తెగ తిరిగేసింది.








"ముద్దు పెట్టలేదని నన్ను రిజెక్ట్ చేసింది".. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించిన అక్షయ్ కుమార్..!!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>