Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-tie-up-with-other-parties-to-win-on-bjp9c00b43c-4191-49a5-b553-fe6e371df3a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-tie-up-with-other-parties-to-win-on-bjp9c00b43c-4191-49a5-b553-fe6e371df3a8-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ గత పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ పార్టీ పాచికలు ఏమాత్రం పారడంలేదు. దీంతో ఈసారి ఎలాగైనా బీజీని ఓడించాలని పద్మవ్యూహమే పన్నుతోంది. అయితే ఇది పార్లమెంట్ ఎన్నికల కోసం కాదు. అతి త్వరలో..congress in assam;kerala;delhi;bharatiya janata party;india;puducherry;west bengal - kolkata;congress;media;parliment;assembly;cpi;partyబీజేపీని ఓడించేందుకు పద్మవ్యూహం.. అందరూ కలిసి..బీజేపీని ఓడించేందుకు పద్మవ్యూహం.. అందరూ కలిసి..congress in assam;kerala;delhi;bharatiya janata party;india;puducherry;west bengal - kolkata;congress;media;parliment;assembly;cpi;partyWed, 20 Jan 2021 09:45:00 GMTకాంగ్రెస్ గత పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ పార్టీ పాచికలు ఏమాత్రం పారడంలేదు. దీంతో ఈసారి ఎలాగైనా బీజీని ఓడించాలని పద్మవ్యూహమే పన్నుతోంది. అయితే ఇది పార్లమెంట్ ఎన్నికల కోసం కాదు. అతి త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రత్యర్థి పార్టీలతో చర్చలు జరిపుతోంది. ఎన్నికల్లో ఒక్కటిగా పోటీ చేసేందుకు జట్టు కట్టేందుకు సిద్ధమైంది.

2021లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ముఖ్యమే అయినా.. కాంగ్రెస్ మాత్రం ప్రత్యేకంగా అసోం పై దృష్టిపెట్టింది. ఈ రాష్ట్రంపై ఎలాగైనా పట్టు సాధించాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసోంలోని బీజీపీ ప్రత్యర్థి పార్టీలైన ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచలిక్ గణ మోర్చాల నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కూడా కుదిరినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలపడాలంటే ఒంటరిగా సాధ్యం కాదని అర్ధం చేసుకున్న కాంగ్రెస్.. ఇతర పార్టీలకు కూడా ఈ విషయాన్ని అర్ధమయ్యేలా తెలియజెప్పింది. దీంతో ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) అధినేత  బరుద్దీన్ అజ్మల్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కలిసి ముందుకెళ్లేందుకు అంగీకరించారు. ఈ ఐదు పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
 
బీజేపీని అధికారంలో నుంచి దింపేందుకు తాము మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌ పార్టీల నేతలు ప్రకటించారు. తమతో పాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచలిక్ గణ మోర్చా పార్టీలు కలిసినట్లు చెప్పారు. గువాహటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచలిక్ గణ మోర్చా నేతలు తమ 6 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అసోం ప్రజల సంక్షేమం కోరి తామంతా కలసి పోటీ చేయనున్నామని, ఇక తమ వికాయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఆ పార్టీని ఓడించేందుకు తమ కూటమితో జతకట్టాలని అభ్యర్థించాయి.




కరోనా భయం.. అతను చేసిన పనికి పోలీసులు షాక్..?

"ఈనాడు"-"ఆంధ్రజ్యోతి".. "సాక్షి"గా.. జగన్‌ సర్కారుకు వాతలు..!?

టీడీపీలో జరిగిందే వైసీపీలో జరుగుతుందా...?

కేటీఆర్ సీఎం కావడం ఖాయమే!

ఉమా మేటర్‌లో ఆ టీడీపీ నేతలు సైలెంట్...కొడాలికి సపోర్ట్..!

ఢిల్లీలో జ‌గ‌న్ టార్గెట్‌గా జ‌రుగుతుంది బాస్‌.. వైసీపీలో గుస‌గుస..‌!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>