PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand908638c-9ba9-4c76-ab39-c05f20df9719-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand908638c-9ba9-4c76-ab39-c05f20df9719-415x250-IndiaHerald.jpgఎంతో మోజుతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఏకంగా 151 సీట్లను జగన్ ని మెచ్చి జనం కట్టబెట్టారు. తమకు ఏదో మేలు జరుగుతుందని, విభజన ఏపీలో ప్రగతి పరుగులు పెడుతుందని కూడా భావించారు. కానీ జరుగుతున్నది చూస్తే వేరుగా ఉంది. jagan;pragathi;jagan;ycp;research and analysis wing;party;mantra;paruguవైసీపీకి డేంజర్ బెల్స్...?వైసీపీకి డేంజర్ బెల్స్...?jagan;pragathi;jagan;ycp;research and analysis wing;party;mantra;paruguWed, 20 Jan 2021 10:00:00 GMTజగన్ ని మెచ్చి జనం కట్టబెట్టారు. తమకు ఏదో మేలు జరుగుతుందని, విభజన ఏపీలో ప్రగతి పరుగులు పెడుతుందని కూడా భావించారు. కానీ జరుగుతున్నది చూస్తే వేరుగా ఉంది.

ఏపీలో అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. దానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పగుళ్ళు తో కొట్టుకుపోయిన రోడ్లే ఉదాహరణగా కనిపిస్తాయి. అధికారంలోకి వైసీపీ వచ్చి దాదాపుగా రెండేళ్ళు అవుతోంది. కానీ రోడ్లకు కనీసం ఇంత సిమెంట్ వేసి గుంతలను కప్పే సీన్ అయితే  ఎక్కడా కనిపించలేదు.

ఇక పెద్ద ప్రాజెక్టులను ఏపీలో ఏమి  అభివృద్ధి ఏం చేస్తారు అన్నదే జనం లో ఉన్న మాట. ఇక ఏపీలో గత ఇరవై నెలల పాలనలో ఎక్కడ చూసినా గొడవలు, గోలలు తప్ప ఒక్క రోజు ప్రశాంతంగా నడిచింది అన్న మాట లేదు. నిజానికి ప్రతిపక్షాలు ఏపీలో ఏ విషయం మీదనైనా ప్రశ్నిస్తాయి. అవి వాటి హక్కు, బాధ్యత. దానికి జాగ్రత్తగా బదులు ఇవ్వాల్సిన కర్తవ్యం  అధికారంలో ఉన్న వారి మీద ఉంటుంది.

కానీ వైసీపీలో అది కనిపించడంలేదు. ఎదురు దాడే శరణ్యం అన్నట్లుగా మంత్రులు సైతం రెచ్చిపోతున్నారు. బూతు పురాణాలతో హడావుడి చేస్తున్నారు. దీంతో జనానికి ఇదేంటి రా బాబూ అనుకోవాల్సివస్తోంది. మరో వైపు చూస్తే ఏపీని అప్పుల కుప్పగా చేశారు అన్నది వాస్తవం. దానికి గత సర్కార్ తో పాటు ప్రస్తుత సర్కార్ కూడా కారణం.

ఎంతసేపూ అప్పు చేసి పప్పు కూడు తప్ప రేపటి కోసం చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి ఎంతో మోజుతో అధికారంలోకి తెచ్చిన పార్టీ కేవలం ఇరవై నెలల్లోనే ఇలా అసమ్మతిని మూటకట్టుకుంది అంటే ఆ పాపం ఏలిన పాలకులదే అని చెప్పాలి. ఏపీలో ప్రజాభిప్రాయం బాగా మారుతోంది. అది అధికార వైసీపీకి వ్యతిరేకంగా కూడా మారుతోంది. ఇప్పటికైనా తేరుకోకపోతే ఇంతే సంగతులు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదుగా.




పవన్ కళ్యాణ్ సరసన అనసూయ...?

బీజేపీని ఓడించేందుకు పద్మవ్యూహం.. అందరూ కలిసి..

"ఈనాడు"-"ఆంధ్రజ్యోతి".. "సాక్షి"గా.. జగన్‌ సర్కారుకు వాతలు..!?

జగన్ కు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు..??

ఇన్‌సైడర్ కుట్ర లేదట.. మరిప్పుడేమంటారో ?

బాబోయ్.. చైనా మరోసారి ప్రపంచాన్ని ముంచేయబోతోందా..?

రామతీర్థం విగ్రహాల ప్రత్యేకతలు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>