PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/highcourta28a7f6e-7d91-4577-a48b-2f2b8a014a85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/highcourta28a7f6e-7d91-4577-a48b-2f2b8a014a85-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులపై ఉన్న కేసులను కొట్టివేసింది. గతంలో కృష్ణాయపాలెం ప్రాంత రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటి సెక్షన్లు ఎత్తివేయాలని రైతులు క్వాష్ పిటిషన్ వేశారు.. రైతుల తరఫున లాయర్ ఈ విషయమై పలు వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. అట్రాసిటీ సెక్షన్లు తొలగించాలని తీర్పు ఇచ్చింది.high court;amaravati;andhra pradesh;district;high court;scheduled caste;scheduled tribes;police;capital;arrest;mangalagiri;narasaraopet;petta;krishnayapalemరాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...high court;amaravati;andhra pradesh;district;high court;scheduled caste;scheduled tribes;police;capital;arrest;mangalagiri;narasaraopet;petta;krishnayapalemWed, 20 Jan 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులపై ఉన్న కేసులను కొట్టివేసింది. గతంలో కృష్ణాయపాలెం ప్రాంత రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటి సెక్షన్లు ఎత్తివేయాలని రైతులు క్వాష్ పిటిషన్ వేశారు.. రైతుల తరఫున లాయర్ ఈ విషయమై పలు వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. అట్రాసిటీ సెక్షన్లు తొలగించాలని తీర్పు ఇచ్చింది. కృష్ణాయపాలెంలోని మొత్తం 11 మంది రైతులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.


ఇక ఆ కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే... గత అక్టోబర్‌ నెలలో ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వెలువడించిన మూడు రాజధానుల అంశంకు మద్దతు తెలుపుతూ  చేస్తున్న ర్యాలీకి హాజరయ్యేందుకు కొంతమంది ఆటోల్లో వస్తుండగా కృష్ణాయపాలెం దగ్గర రాజధాని రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అదే రోజు రాత్రి మంగళగిరి మండల వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఈపూరి రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతుంటే సర్దిచెప్పడానికి వెళ్లిన తనను రైతులు బెదిరించారని చెప్పారు. దీంతో 11 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం సహా, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైతుల్ని ముందు నరసరావుపేట సబ్‌జైలుకు, అక్కడినుంచి మంగళవారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ క్రమంలో వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకురావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అరెస్ట్ అయిన ఏడుగురు వ్యక్తులలో ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు ఉన్నారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడం, పైగా వారికి బేడీలు వేసి తీసుకురావడంతో ఎస్సీ సంఘాలు, రైతు సంఘాలు అలాగే పలు పార్టీలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. తర్వాత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


రేవంత్ రెడ్డికి కేటీఆర్ భయపడ్డారా!

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్వాగతం: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>