PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-politicsf65652d1-7591-4536-b80c-c8ad06f6c04a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-politicsf65652d1-7591-4536-b80c-c8ad06f6c04a-415x250-IndiaHerald.jpgదేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి విధితమే. ఆ దిశగా ఇప్పటికే కీలక నిర్ణయాలు కూడా తీసుకొని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను, అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూల్ ను న్యాయశాఖ రాజధానిగాను ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించగా, ఈ మూడు రాజధానులు విషయంలో అటు ప్రజల నుండి, ఇటు ప్రతిపక్షాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఏడాది కాలంగా అమరావతి నేap politics;amit shah;visakhapatnam;jagan;amaravati;amith shah;high court;kurnool;vishakapatnam;capital;chief minister;minister;central governmentమూడు రాజధానుల విషయమై అమిత్ షా తో చర్చ..!!మూడు రాజధానుల విషయమై అమిత్ షా తో చర్చ..!!ap politics;amit shah;visakhapatnam;jagan;amaravati;amith shah;high court;kurnool;vishakapatnam;capital;chief minister;minister;central governmentWed, 20 Jan 2021 19:13:00 GMTజగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి విధితమే. ఆ దిశగా ఇప్పటికే కీలక నిర్ణయాలు కూడా తీసుకొని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగాను, అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూల్ ను న్యాయశాఖ రాజధానిగాను ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించగా, ఈ మూడు రాజధానులు విషయంలో అటు ప్రజల నుండి, ఇటు ప్రతిపక్షాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఏడాది కాలంగా అమరావతి నే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని నిర్విరామంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

అమరావతి రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో   ప్రభుత్వ కార్యకలాపాల కోసం భవనాలు వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నూల్ లో ఏర్పాటు చేయబోయే హైకోర్టు పై సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి పలు విషయాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా.. కర్నూలులో హైకోర్టును నెలకొల్పేలా రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమిత్ షాను కోరినట్లు సమాచారం. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌తో కలిసి షాను ఆయన కలిశారు. గంటకుపైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని సీఎం ప్రస్తావించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికార ప్రకటనలో తెలిపింది. దీన్ని బట్టి చూస్తే రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది.


ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>