MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/new-rumor-on-rajamouli-mahesh-movie97dd9d11-b50f-4fa0-b87e-eb6d4a4be600-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/new-rumor-on-rajamouli-mahesh-movie97dd9d11-b50f-4fa0-b87e-eb6d4a4be600-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది చెప్పండి. చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కించుకున్న మహేష్, ఆ పై రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ, యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1999లో ప్రేక్షకులు ముందుకు వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. super star mahesh babu ss rajamouli movie news;sarkaru vaari paata;mahesh;prema;prince;rajamouli;suma;suma kanakala;india;rajaka;tollywood;cinema;baba bhaskar;rajani kanth;murugadoss;hollywood;love;audience;blockbuster hit;a r murugadoss;success;spyder;raghavendraఆట్ ..... మహేష్ బాబా మజాకా .....దెబ్బకు హాలీవుడ్ స్టార్స్ దిగి వస్తున్నారుగా .... ??ఆట్ ..... మహేష్ బాబా మజాకా .....దెబ్బకు హాలీవుడ్ స్టార్స్ దిగి వస్తున్నారుగా .... ??super star mahesh babu ss rajamouli movie news;sarkaru vaari paata;mahesh;prema;prince;rajamouli;suma;suma kanakala;india;rajaka;tollywood;cinema;baba bhaskar;rajani kanth;murugadoss;hollywood;love;audience;blockbuster hit;a r murugadoss;success;spyder;raghavendraWed, 20 Jan 2021 21:15:41 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది చెప్పండి. చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కించుకున్న మహేష్, ఆ పై రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ, యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1999లో ప్రేక్షకులు ముందుకు వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

ఇక ఆ తరువాత నుండి వరుస ఛాన్స్ లతో కొనసాగిన మహేష్ బాబు, ఆపై ప్రిన్స్ గా సూపర్ స్టార్ గా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానుల ప్రేమ చూరగొని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతుండగా, అన్ని వర్గాల ఆడియన్స్ లో ఆయనకు విశేషమైన అభిమానగణం ఉంది. ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీ ద్వారా ఒకే ఒక్క ద్విభాషా సినిమా చేసిన మహేష్, మరోవైపు కేవలం తెలుగు భాషలోనే వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు పాన్ ఇండియా స్టార్ గా దాదాపుగా అన్ని భాషల ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఇక అతి త్వరలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీలో సూపర్ స్టార్ నటించనున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకగణం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది.

అయితే ఈ సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుంది, మహేష్ పాత్ర ఎలా ఉంటుందని, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఏ రేంజ్ లో టెక్నీకల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని బట్టి ఈ మూవీలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ముఖ్య పాత్రలు చేయనున్నారని, కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని విజయేంద్రప్రసాద్, రాజమౌళికి వినిపించారని, అయితే ఆ స్టోరీ లోని రెండు కీలక పాత్రలకు సదరు హాలీవుడ్ నటులని తీసుకునేందుకు రాజమౌళి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే సూపర్ స్టార్ పవర్, స్టామినా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు......!!


ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>