PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-farmers-central-governments-new-new-rulesab2e7579-aed2-4b06-ac4b-d6ae2af049c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-farmers-central-governments-new-new-rulesab2e7579-aed2-4b06-ac4b-d6ae2af049c6-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేని విధంగా రైతులు రోడ్లపైకి వచ్చి కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపుగా రెండు నెలల నుండి పలు రాష్ట్రాలలో రైతులు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవంటూ వాటిని పూర్తిగా రద్దు చేయాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులlatest news;pratishta;government;central governmentరైతులకు శుభవార్త..ఏడాది పాటు కొత్త చట్టాలను నిలిపి వేయనున్న కేంద్రం..!!రైతులకు శుభవార్త..ఏడాది పాటు కొత్త చట్టాలను నిలిపి వేయనున్న కేంద్రం..!!latest news;pratishta;government;central governmentWed, 20 Jan 2021 20:14:41 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేని విధంగా రైతులు రోడ్లపైకి వచ్చి కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.  దాదాపుగా రెండు నెలల నుండి పలు రాష్ట్రాలలో  రైతులు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవంటూ వాటిని పూర్తిగా రద్దు చేయాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులతో ఇప్పటికే తొమ్మిది సార్లు చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు.

రైతులు కొత్త చట్టాలలో మూడింటిని ఖచ్చితంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రం వాటికి సవరణలు చేస్తాం తప్ప రద్దు చేయబోమని ఖరాఖండీగా చెప్పడంతో రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ కేంద్రానికి కొరకరాని కొయ్యగా మారారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు రైతుల తరపున మద్దతు పెరుగుతూ ఉండడం కేంద్రానికి ప్రతికూలంగా మారింది. ఇప్పటికే పలు ప్రధాన పార్టీల నేతలు రైతులకు మద్దతు ప్రకటించడం, రోజురోజుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఈ సమస్య  కేంద్రానికి సవాల్ గా మారింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ సమస్యను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ కేంద్రంపై సంధించే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి.

 దాంతో కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . కేంద్రం ఓ మెట్టు దిగివచ్చి రైతు చట్టాలను ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.  రైతులతో కొత్త చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏడాది తర్వాత కేంద్రం ఈ చట్టాలను కొనసాగిస్తుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతకంటే ముందు ఈ ప్రతిపాదనలను రైతు సంఘాలు ఎంతవరకు ఆమోదిస్తాయో చూడాలి. 


"ముద్దు పెట్టలేదని నన్ను రిజెక్ట్ చేసింది".. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించిన అక్షయ్ కుమార్..!!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>