PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder46063835-ccd4-4a96-9c7d-db6f20555fad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder46063835-ccd4-4a96-9c7d-db6f20555fad-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కుటుంబ కలహాలతో ఒక్కరు, ప్రేమ వ్యవహారంతో మరొక్కరు, వివాహేతర సంబంధాల వలన మరికొంత మంది ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాపెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణం జరిగింది. భార్య గాయత్రిపై భర్త ఢిల్లీ బాబు కత్తితో దాడికి తెగబడ్డాడు. చికిత్సపొందుతూ గాయత్రి మృతిచెందింది. murder;cbn;prema;delhi;district;east;police;cm;village;marriage;love;bike;tamilnadu;husband;wife;fatherదారుణం: ప్రియురాలిని 15 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎందుకంటే..!?దారుణం: ప్రియురాలిని 15 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎందుకంటే..!?murder;cbn;prema;delhi;district;east;police;cm;village;marriage;love;bike;tamilnadu;husband;wife;fatherWed, 20 Jan 2021 08:00:00 GMTప్రేమ వ్యవహారంతో మరొక్కరు, వివాహేతర సంబంధాల వలన మరికొంత మంది ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాపెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణం జరిగింది. భార్య గాయత్రిపై భర్త ఢిల్లీ బాబు కత్తితో దాడికి తెగబడ్డాడు. చికిత్సపొందుతూ గాయత్రి మృతిచెందింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి పోతనపెట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు అనే యువకుడు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం ఢిల్లీబాబు, గాయత్రి ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే యువతి మైనర్ కావడంతో పెళ్లి చెల్లదంటూ పోలీసులు ఇద్దర్నీ ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఢిల్లీ బాబును గాయత్రి  దూరం పెడుతూ వస్తోంది. ఢిల్లీ బాబు ఆమెను కలిసేందుకు వచ్చినా ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారు.

అయితే తనతో కాపురానికి రావాలని ఢిల్లీ బాబు గాయత్రిని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అంది. రానని తేల్చి చెప్పేసింది. దీంతో ముంగళవారం గాయత్రి తన బంధువుల ఇంటి నుంచి మరో అమ్మాయితో కలిసి బైక్ పై వస్తోంది. ఆమె వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఢిల్లీబాబు ఆమెను దారిలో అడ్డుకున్నాడు. తనతో వస్తావా లేదా అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 15సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత గొంతుకోసి ప్రాణాలు తీసేశాడు. తీవ్రగాయాలపాలైన యువతిని బంధువులు పెనుమూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా గాయత్రి మృతి చెందింది.

ఇక గాయత్రిపై దాడి చేసిన ఢిల్లీ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ప్రియురాలి బంధువులు ఆగ్రహంతో ఢిల్లీబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటిని ధ్వంసం చేశారు. అంతేాకాదు ఢిల్లీబాబు తండ్రి షణ్ముఖ్ రెడ్డిని చితకబాది చెట్టుకు కట్టేశారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు పోలీసులు ఢిల్లీ బాబు కోసం గాలిస్తున్నారు.


సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. అయినా ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>