MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivas275a4682-200a-4933-acb0-9f501a2178b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivas275a4682-200a-4933-acb0-9f501a2178b3-415x250-IndiaHerald.jpg రాజమౌళి కొరటాల శివల తరువాత స్థానం ఖచ్చితంగా త్రివిక్రమ్ కు దక్కు తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్ 3 దర్శకుల స్థానంలో ఉండి కూడ త్రివిక్రమ్ ఎందుకు తెర వెనుక పాత్ర వహిస్తూ కొన్ని సినిమాల నిర్మాణం పర్యవేక్షిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.జూనియర్ తో మూవీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్న త్రివిక్రమ్ ఆసినిమా వ్యవహారాలు చూస్తూనే పవన్ తో నిర్మాణం జరుపుకుంటున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ విషయంలో అన్నీ తానై తెరవెనుక నడిపిస్తున్నాడు అన్నమాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.trivikram srinivas;pawan;bhaskar;jr ntr;koratala siva;rajamouli;trivikram srinivas;vijay;vijay bhaskar;cinema;baba bhaskar;industry;remake;director;joseph vijay;agnyaathavaasiత్రివిక్రమ్ తెరవెనుక పాత్ర పై ఆసక్తికర కామెంట్స్ !త్రివిక్రమ్ తెరవెనుక పాత్ర పై ఆసక్తికర కామెంట్స్ !trivikram srinivas;pawan;bhaskar;jr ntr;koratala siva;rajamouli;trivikram srinivas;vijay;vijay bhaskar;cinema;baba bhaskar;industry;remake;director;joseph vijay;agnyaathavaasiWed, 20 Jan 2021 11:00:00 GMTరాజమౌళి కొరటాల శివల తరువాత స్థానం ఖచ్చితంగా త్రివిక్రమ్ కు దక్కు తుంది. ప్రస్తుతం  ఇండస్ట్రీ టాప్ 3 దర్శకుల స్థానంలో ఉండి కూడ త్రివిక్రమ్ ఎందుకు తెర వెనుక పాత్ర వహిస్తూ కొన్ని  సినిమాల నిర్మాణం పర్యవేక్షిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


జూనియర్ తో మూవీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్న త్రివిక్రమ్  ఆసినిమా వ్యవహారాలు చూస్తూనే పవన్ తో నిర్మాణం జరుపుకుంటున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ విషయంలో అన్నీ తానై తెరవెనుక నడిపిస్తున్నాడు అన్నమాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పవన్ దృష్టికి తీసుకెళ్లిన దగ్గర నుంచి ఈప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం వరకు అన్ని పనులు త్రివిక్రమ్ సలహా సంప్రదిపులతోనే జరిగాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి.  


ఈ సినిమాకుసంబంధించి  స్క్రీన్ ప్లే మాటలు అందిస్తోంది త్రివిక్రమ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ డైరెక్టర్ కాకముందు విజయ్ భాస్కర్ అనే దర్శకుడికి తెరవెనుక అన్నీ తానై సినిమా నిర్మాణం జరిపించేవాడు అన్న గుసగుసలు అప్పట్లో వచ్చేవి. అయితే త్రివిక్రమ్  ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాక కూడ  ‘అయ్యప్పన్ కొషియమ్’ విషయంలో తెరవెనుక అన్నీ తానై ఉంటూ సెట్ మీద సాగర్ అనే చిన్న దర్శకుడిని పెట్టడం వెనుక త్రివిక్రమ్ ఆంతర్యం  ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.  


వాస్తవానికి త్రివిక్రమ్ పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలి అని అనుకంటే చాలు నిర్మాతలు క్యూ  కడతారు. అయితే అలా చేయకుండా ‘అయ్యప్పన్ కొషియమ్’ రీమేక్ విషయం తెరవెనక పాట పోషించడానికి గల కారణం పై అనేకమంది ఆశ్చర్య పోతున్నారు. తెలుస్తున్న సంమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి అన్ని తానై వ్యవహరిస్తూ నటీనటుల ఎంపికతోపాటు టెక్నీషియన్లు ఎంపిక విషయంలో సలహాలు ఇస్తూ ఈమూవీకి పేరుకు దర్శకుడు కాకపోయినా ఈ సినిమా నిర్మాణ విషయంలో ‘అజ్ఞాతవాసి’ గా ప్రవర్తిస్తున్నాడు అంటూ త్రివిక్రమ్ తెర వెనుక పాత్ర పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..





డబ్బే డబ్బు : అద్దె బంధువుల సందడితో డబ్బే డబ్బు !

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

చక్రవ్యూహం: చైనాకు ఊపిరి సలపనివ్వని డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో జో బైడెన్ బంధి అయ్యారా!

దారి త‌ప్పిన మంత్రులు.. ఈ నేరం ఎవ‌రిది? వైసీపీలో చ‌ర్చ‌

ఈ మంత్రి ప‌ద‌వి మాకొద్దోయ్‌.. వైసీపీ మంత్రుల్లో ఇంత బాధ ఎందుకు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>