MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan0f831383-231c-4146-a28a-d56c7847818a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan0f831383-231c-4146-a28a-d56c7847818a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో తన టాలెంట్ కూడా చూపించాడు ప‌వ‌న్. అంతేకాదు.. తన మార్షల్ ఆర్ట్స్ కారణంతోనే సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయేలా కంపోజ్ చేసేవాడు. pawan kalyan;pawan;chiranjeevi;kalyan;kushi;pawan kalyan;girl;nagababu;annayya;akkada ammai ikkada abbai;badri;jalsaపవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం అతడేనట..!?పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం అతడేనట..!?pawan kalyan;pawan;chiranjeevi;kalyan;kushi;pawan kalyan;girl;nagababu;annayya;akkada ammai ikkada abbai;badri;jalsaWed, 20 Jan 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో తన టాలెంట్ కూడా చూపించాడు ప‌వ‌న్. అంతేకాదు.. తన మార్షల్ ఆర్ట్స్ కారణంతోనే సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయేలా కంపోజ్ చేసేవాడు.

అయితే పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి కారణం చిరంజీవి. అవును.. అప్పట్లో తన పెద్ద తమ్ముడు నాగబాబుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చిరంజీవి చాలా కోరుకున్నాడు కానీ ఆయన లాయర్ అవుతానంటూ అటు వైపు వెళ్లిపోయాడు. అలా తన కోరిక పవన్ వైపు మళ్లించాడు. పవన్ కూడా ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై అస్సలు ఆసక్తి చూపించలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన చెంతకు వచ్చింది అది. నేర్చుకోవాల్సిన అవసరం కల్పించింది కూడా చిరంజీవే.

ఇక చెన్నైలో పవన్ చదువుకుంటున్న సమయంలో కొందరు చిరంజీవి సినిమాలు చూసి అతన్ని ఊరికే తిట్టేవారంట. అంతేకాక కాలేజీలో కొందరు పవన్ ముందే తన అన్నయ్య నటనతోపాటు లుక్‌పై కూడా కొన్ని విమర్శలు చేసేవాళ్లు. అలాంటివి చూసినపుడు విన్నపుడు రక్తం మరిచిపోయేదని.. కానీ సన్నగా రివటలా ఉన్న పవన్ వాళ్లను ఎదిరించలేకపోయాడని చెప్తుంటారు పవన్. ఇక వాళ్లను కొట్టాలంటే ఇలా ఉంటే సరిపోదు.. కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.. అప్పుడే ఈ ఆలోచన పవన్ బుర్రలోకి వచ్చింది.

అయితే తన అన్నయ్యను కామెంట్ చేస్తున్న వాళ్ల తుక్కు రేగ్గొట్టాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన శిక్షణ తీసుకున్నట్లు పవన్ సన్నిహితులే చెప్తుంటారు. అందులో ఆ తర్వాత ఆయన బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో చూపించాడు. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా పవన్‌లో అదే ఎనర్జీ కనిపిస్తుంది. మొన్న విడుదలైన వకీల్ సాబ్ టీజర్ లోనూ పవన్ అదే ఎనర్జీతో ఫైట్స్ చేశాడు.


డబ్బే డబ్బు : అద్దె బంధువుల సందడితో డబ్బే డబ్బు !

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

చక్రవ్యూహం: చైనాకు ఊపిరి సలపనివ్వని డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో జో బైడెన్ బంధి అయ్యారా!

దారి త‌ప్పిన మంత్రులు.. ఈ నేరం ఎవ‌రిది? వైసీపీలో చ‌ర్చ‌

ఈ మంత్రి ప‌ద‌వి మాకొద్దోయ్‌.. వైసీపీ మంత్రుల్లో ఇంత బాధ ఎందుకు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>