MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-legends6a1d23b4-cdde-458c-83b8-16671601f0ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-legends6a1d23b4-cdde-458c-83b8-16671601f0ac-415x250-IndiaHerald.jpgగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అరుదైన టాలెంట్ ఉంటేనే గిన్నిస్ బుక్ లో ఎక్కటం సాధ్యం అవుతుంది. కొందరు అత్యధిక ఎత్తు, బరువు ఉన్నందుకు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటే మరికొందరు అత్యల్ప ఎత్తు ఉన్నందుకు గాను గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు.tollywood legends;susheela;geetha;jeevitha rajaseskhar;srinivas;vijaya nirmala;tollywood;sangeetha;doctor;comedian;antarctica;padma shriగిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..tollywood legends;susheela;geetha;jeevitha rajaseskhar;srinivas;vijaya nirmala;tollywood;sangeetha;doctor;comedian;antarctica;padma shriTue, 19 Jan 2021 13:00:00 GMTటాలీవుడ్ సెలబ్రిటీలు చూపించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. పులపాక సుశీల:

నేపథ్య గాయకురాలిగా 50 సంవత్సరాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన పి.సుశీల 12 భాషల్లో ఏకంగా 17, 695 పాటలు పాడి 4 ఏళ్ల క్రితమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆమె స్థానం దక్కించుకున్నారు. దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తో కలిసి ఆమె 1336 పాటలు పాడారు. ఏ భాషలోనైనా స్పష్టమైన ఉచ్ఛారణతో పాడగల పి. సుశీలమ్మ కి భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు అంతా కలిసి ఆమె పేరిట ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ క్రియేట్ చేసి.. ఆమె పాడిన పాటలన్నీ ఒక దగ్గరికి చేర్చి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ న్యాయనిర్ణేతలకు పంపించి బుక్ లో స్థానం దక్కేలా చేశారు.

2. బ్రహ్మానందం

30 సంవత్సరాల సినీ జీవితంలోనే ఏకంగా 1000 సినిమాల్లో కమెడియన్ గా నటించి అరుదైన రికార్డును నెలకొల్పిన కన్నెగంటి బ్రహ్మానందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 2009లో బ్రహ్మానందానికి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.

3. డాక్టర్ డి.రామానాయుడు

13 భారతీయ భాషలలో 150 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన డాక్టర్ డి.రామానాయుడు కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. అత్యధిక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినందుకు గాను ఆయనకి 2008 లో గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది.

4. గజల్ శ్రీనివాస్

కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాష‌ల్లో గాందేయావాదంపై గజల్స్ పాడినందుకు గాను ఆయనకు 2008లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ చోటు దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు మరొక గిన్నిస్ రికార్డు కూడా ఆయన నెలకొల్పారు. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచం మొత్తంలో 6 వేల కచేరీలు చేశారు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ భాషల్లో శాంతి గీతాలు పాడటం వలన ఆయనను అనేక దేశాలు ఆహ్వానించాయి.

5. ఎస్పీ బాలసుబ్రమణ్యం:

53 యేండ్ల పాటు 40 వేల పాటలు పాడి సంగీత ప్రియులను బాగా అలరించిన దివంగత నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు.

6. విజయ నిర్మల:

తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో దాదాపు 42 సినిమాలు తెరకెక్కించిన ఏకైక మహిళా దర్శకురాలిగా విజ‌య‌నిర్మ‌ల 2000లో గిన్నిస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.


గాయలతో కీలక ఆటగాళ్లు.. జట్టు ఎంపిక ఎట్టా ఉంటాదో..?

గతంలో వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లు ఎంతమందో తెలుసా...?

ఆ దుంప తింటే క్యాన్సర్ ను అరికట్టవచ్చు?

వావ్: పోలవరం బాధ్యతలు తీసేసుకుంటున్న కేంద్రం

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్...?

షాకింగ్: బిజెపి కొత్త ఛానల్... జై శ్రీరాం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>