MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/katrina-kaif-and-prabhas5d18b889-f95b-4c8d-a369-ef2893476c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/katrina-kaif-and-prabhas5d18b889-f95b-4c8d-a369-ef2893476c0a-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటి కత్రినా కైఫ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామకు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. 'మల్లీశ్వరి'లో వెంకీతో జోడీకట్టి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. అలాగే, బాలకృష్ణతో "అల్లరి పిడుగు"లో జోడీ కట్టింది. అలా తెలుగువారికి బాగా దగ్గరైంది. కత్రినా కైఫ్ కు ఓ తెలుగు హీరోపై క్రష్ ఉందట. katrina kaif and prabhas;beauty;prabhas;katrina kaif;pooja hegde;prasanth;prashanth neel;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;bahubali;january;saaho;media;hindi;event;hero;heroine;prasanth neel;wanted;malliswari;prashant kishor;allari;crushప్రభాస్ కు జోడీగా మల్లీశ్వరిప్రభాస్ కు జోడీగా మల్లీశ్వరిkatrina kaif and prabhas;beauty;prabhas;katrina kaif;pooja hegde;prasanth;prashanth neel;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;bahubali;january;saaho;media;hindi;event;hero;heroine;prasanth neel;wanted;malliswari;prashant kishor;allari;crushTue, 19 Jan 2021 17:00:00 GMTబాలీవుడ్ నటి కత్రినా కైఫ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామకు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. 'మల్లీశ్వరి'లో వెంకీతో జోడీకట్టి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. అలాగే, బాలకృష్ణతో "అల్లరి పిడుగు"లో జోడీ కట్టింది. అలా తెలుగువారికి బాగా దగ్గరైంది. కత్రినా కైఫ్ కు ఓ తెలుగు హీరోపై క్రష్ ఉందట.

హీరో మరెవరో కాదు. 'బాహుబలి'తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్. ప్రభాస్ తన డార్లింగని అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. ఒకానొక ఈవెంట్ సందర్భంగా కత్రినా కైఫ్ తన మనసులోని మాటను మీడియా ముందు బయటపెట్టింది. "బాహుబలి" స్టార్ ప్రభాస్ పై తనకు క్రష్ ఉందని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మను ప్రభాస్ కు జోడీగా చూసే అవకాశం అభిమానులకు కలిగింది. వివరాల్లోకి వెళ్తే...

"సాహో" ఫేమ్ ప్రభాస్ ప్రస్తుతం తన అప్కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సలార్"పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా జనవరి చివరి వారం నుంచి ఫ్లోర్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. బాగా హైప్ తెచ్చుకున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే చోటుచేసుకున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు తెరకెక్కిన యాక్షన్ మూవీస్ కు భిన్నంగా తెరకెక్కబోతోందట.  

ఇందులో ప్రభాస్ వయలెంట్ క్యారక్టర్లో నటించబోతున్నాడట. ఇందుకోసం తన లుక్ పై కూడా వర్క్ చేస్తున్నాడట. ఫిలిం ఇండస్ట్రీలోని లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా నటించే అవకాశాలున్నాయట. ఫిమేల్ లీడ్ రోల్ కోసం కత్రినాను సంప్రదించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.

ఒకవేళ కత్రినా ఈ సినిమాకు గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 15 ఏళ్ళ తరువాత కత్రినా తెలుగు ప్రేక్షకులను పలకరించబోయే సినిమా ఇదే అవుతుంది.


రవితేజ కధతో రిస్క్ చేస్తోన్న డైరెక్టర్

ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న చిరంజీవి!

అందరున్నా ఒంటరై పోయిన హీరో..!

సోనుసూద్ అంబులెన్సులు

షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>