PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpbjpaa291b6a-47da-4ff3-a3d6-e1eb982ec504-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpbjpaa291b6a-47da-4ff3-a3d6-e1eb982ec504-415x250-IndiaHerald.jpg ఇక‌, అనంత‌రం జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఆమెను ప‌క్క‌న పెట్టారు. మ‌రీ ముఖ్యంగా 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. ప‌డాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్న ఆమె.. ఇటీవ‌ల పార్టీలో ప్ర‌క‌టించిన ప‌ద‌వుల విష‌యంలో అయినా.. త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించారు. అయితే.. అప్పుడు కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. దీనికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజే కార‌ణ‌మ‌ని ఆమె బాహాటంగానే విమ‌ర్శించ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు స్వ‌యంగా bjp tdp;ashok;nithya new;thirtha;bharatiya janata party;somu veerraju;district;minister;letter;tdp;central government;dookudu;partyటీడీపీ మాజీ మ‌హిళా మంత్రికి కాషాయం కండువా...!టీడీపీ మాజీ మ‌హిళా మంత్రికి కాషాయం కండువా...!bjp tdp;ashok;nithya new;thirtha;bharatiya janata party;somu veerraju;district;minister;letter;tdp;central government;dookudu;partyTue, 19 Jan 2021 11:26:45 GMTటీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ మంత్రి ప‌డాల అరుణ త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో ఉన్న అరుణ‌.. విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. 1989, 1994 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రిప‌ద‌వి కూడా సాధించారు. చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో ప‌డాల ప‌నిచేశారు. అవినీతి లేని, మ‌చ్చ‌ప‌డ‌ని నాయ‌కురాలిగా విజ‌య‌న‌గ‌రంలో గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత కూడా 2004లో విజ‌యం సాధించారు. వాస్త‌వానికి ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ హ‌వా ఎక్కువ‌గా ఉండి.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దెబ్బ‌తింది.

అయితే.. ప‌డాల మాత్రం త‌న ఉనికిని నిల‌బెట్టుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత మారిన ప‌రిస్థితిలో 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, అనంత‌రం జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఆమెను ప‌క్క‌న పెట్టారు. మ‌రీ ముఖ్యంగా 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. ప‌డాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్న ఆమె.. ఇటీవ‌ల పార్టీలో ప్ర‌క‌టించిన ప‌ద‌వుల విష‌యంలో అయినా.. త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించారు. అయితే.. అప్పుడు కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. దీనికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజే కార‌ణ‌మ‌ని ఆమె బాహాటంగానే విమ‌ర్శించ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు స్వ‌యంగా వెల్ల‌డించారు.

త‌న‌తో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు భేటీ అయి.. చ‌ర్చించార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే క‌మ‌లం కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమెకు ఏమేర‌కు పార్టీలో ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంది? ప‌్రాధాన్యం ఎలా ఉంటుంది? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో బీజేపీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నాయ‌కుల అవ‌స‌రం చాలా ఉంది. అదేవిధంగా ప్ర‌జ‌ల‌తో నిత్యం మ‌మేక‌మై.. పార్టీని డెవ‌ల‌ప్ చేయాలి. ఈ రెండు కార‌ణాల‌తో చూసిన‌ప్పుడు.. ప‌డాల అరుణ వ‌య‌సు రీత్యా దూకుడుగా ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అదేవిధంగా నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తారా? అనేది కూడా సందేహ‌మే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో మార్పు కొంత వ‌ర‌కు ఆమెకు దోహ‌ద‌ప‌డుతుంద‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు.. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి ఉంటాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>