TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth-comedian-london-raju47a3b19f-3d88-424f-bc1a-5d85b9ed151f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth-comedian-london-raju47a3b19f-3d88-424f-bc1a-5d85b9ed151f-415x250-IndiaHerald.jpgఅందర్నీ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ హాస్యనటుల జీవితాలలో మనకు తెలియని ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పి ఇలా చెప్పుకుంటూపోతే జబర్దస్త్ షో కి రాకముందు వాళ్లంతా కూడా తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.jabardasth comedian london raju;chammak chandra;sudigali sudheer;varsha;adinarayanareddy;jabardasth;london;interview;comedian;father;leaderబర్రెలు కాచే వాడిని..నన్ను సెలబ్రిటీ ని చేసాడు ఆ వ్యక్తి : కమెడియన్ లండన్ రాజుబర్రెలు కాచే వాడిని..నన్ను సెలబ్రిటీ ని చేసాడు ఆ వ్యక్తి : కమెడియన్ లండన్ రాజుjabardasth comedian london raju;chammak chandra;sudigali sudheer;varsha;adinarayanareddy;jabardasth;london;interview;comedian;father;leaderTue, 19 Jan 2021 16:00:00 GMTజబర్దస్త్ హాస్యనటుల జీవితాలలో మనకు తెలియని ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పి ఇలా చెప్పుకుంటూపోతే జబర్దస్త్ షో కి రాకముందు వాళ్లంతా కూడా తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఏమి పేదరికంతో బాధ పడిన హాస్యనటుల లో లండన్ రాజు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ఎంత కటిక దరిద్రం లో జీవించారంటే.. ఓ వర్షం పడుతున్న రాత్రి తన తండ్రి జ్వరం బారిన పడి తన కళ్ళ ముందే ప్రాణాలను కాల్పోతున్నా.. లండన్ రాజు ఏమి చేయలేక నిస్సహాయ తో అలాగే ఉండిపోయారట. తన తండ్రిని ఆసుపత్రికి తరలించడానికి ఒక వాహనానికి డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితిలో లండన్ రాజు ఉండటంతో.. తండ్రి అలాగే మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచారట.

అయితే తన తండ్రి అత్యంత దయనీయమైన పరిస్థితిలో చనిపోవడంతో తన తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారట. ఒకవైపు బాగా రోదిస్తున్న తన తల్లిని.. మరోవైపు చనిపోయిన తన తండ్రిని చూసి.. లండన్ రాజు బాగా ఏడ్చాడట. తన తండ్రి చనిపోతే తమ గ్రామస్తులలోని ఒక్కరు కూడా చూడ్డానికి రాలేదని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ లండన్ రాజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

లండన్ రాజు అసలు పేరు వెంకటేశ్వర్లు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ అనే ఒకే ఒక్క డైలాగ్ తో జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఈయన తల్లిదండ్రులు ఒంగోలు లోని ఒక చిన్న పల్లెటూరు లో వ్యవసాయం చేసేవారు. అయితే ఒకరోజు ఆయన తండ్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగానే తీవ్ర జ్వరం వచ్చింది. ఆ జ్వరం తోనే ఆయన మరణించారు. ఐతే చేతిలో చిల్లిగవ్వ లేని లండన్ రాజు ఏం చేయాలో తెలియక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక చేసేదేమీలేక ఆయన తనకున్న 2 బర్రెలను కాస్తూ జీవితాన్ని సాగించడం ప్రారంభించారు.

అయితే ఈ సమయంలోనే హైపర్ ఆది లండన్ రాజు ని జబర్దస్త్ కి తీసుకొచ్చారు. ఆ విధంగా జబర్దస్త్ షో కి వచ్చిన లండన్ రాజు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రతి టీమ్ లీడర్ స్కిట్ లో ఆయన నటించి ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఐతే కొద్ది రోజుల్లోనే ఆయన జబర్దస్త్ లో సంపాదించిన డబ్బులతో తన గుడిసె ఇంటిని తీసేసి రెండు గదుల డాబా ఇల్లు కట్టించుకోగలిగాడు.


ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న చిరంజీవి!

అందరున్నా ఒంటరై పోయిన హీరో..!

సోనుసూద్ అంబులెన్సులు

షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?

షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>