PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kodali-nani-fires-on-chandrababuac3f33c6-e0f8-4e64-adf4-909623ba63d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kodali-nani-fires-on-chandrababuac3f33c6-e0f8-4e64-adf4-909623ba63d9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై మరోసారి ధ్వజ మెత్తారు. ఈసారి బాబు పై ఆయన విసిరిన మాటల తూటాలు కోటలు దాటి నేరుగా గుచ్చుకున్నాయి. అంత పవర్ఫుల్ గా... ఖచ్చితమైన మాటలతో మాజీ సీఎం చంద్రబాబును విమర్శించారు కొడాలి నాని. kodali nani fires on chandrababu;cbn;ntr;lokesh;nani;jayanthi;kodali nani;jagan;andhra pradesh;telugu;chief minister;minister;qualification;lokesh kanagaraj;nandamuri taraka rama rao;jayamచంద్రబాబుకు ప్రపంచరత్న సిపారసు చేసిన మంత్రి కొడాలి నాని...!చంద్రబాబుకు ప్రపంచరత్న సిపారసు చేసిన మంత్రి కొడాలి నాని...!kodali nani fires on chandrababu;cbn;ntr;lokesh;nani;jayanthi;kodali nani;jagan;andhra pradesh;telugu;chief minister;minister;qualification;lokesh kanagaraj;nandamuri taraka rama rao;jayamTue, 19 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై మరోసారి ధ్వజ మెత్తారు. ఈసారి బాబు పై ఆయన విసిరిన మాటల తూటాలు కోటలు దాటి నేరుగా గుచ్చుకున్నాయి. అంత పవర్ఫుల్ గా... ఖచ్చితమైన మాటలతో మాజీ సీఎం చంద్రబాబును విమర్శించారు కొడాలి నాని. ఎన్టీఆర్ వర్ధంతి, హిందూ దేవాలయాలపై దాడులు సహా పలు అంశాలపై మాట్లాడుతూ చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలు చేస్తున్నారంటూ.... అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న తరహాలో వ్యవహరించడం ఆయనకు మాత్రమే సాధ్యం అంటూ విమర్శించారు.

మహనీయుడు ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఆయన పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని  తేల్చిచెప్పాడు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న అంశం., ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు, మహానాడు ఈ సమయంలో తప్ప మరే సందర్భంలోనూ గుర్తు రాదని ఎత్తిచూపారు. ఈ వినయాలు అన్నీ అప్పట్లో ఎన్టీఆర్ దగ్గరనుండి పదవి లాక్కునే టప్పుడు గుర్తుకు రాలేదా అంటూ తూట్లు పొడిచారు. చంద్రబాబు బ్రతికుండగా ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండీగా మాట్లాడారు . ఎన్టీఆర్ స్క్రీన్ పైన అయితే.... చంద్రబాబు నిజజీవితంలో మహానటుడు అని, సందర్భాన్ని బట్టి మారిపోవడం ఆయనకు అలవాటేనని... పొగిడిన నోటితోనే దూషించగలడు. అదేవిధంగా దూషించిన పెదవి తోనే ప్రశంసించగలడు అంటూ ఏకిపారేశారు నాని.

ఎన్టీఆర్ కు భారతరత్న.., చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే... నారా చంద్రబాబు నాయుడు.. పప్పు లోకేష్ బాబు కలసి ఆ పార్టీని భూస్థాపితం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వంటి మహానాయకుడి మతాల ముసుగులో తనను తాను గొప్ప నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు... కానీ అది నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవాలి అనుకుంటే తగిన శాస్తి తప్పక జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి తెలంగాణలో 1.29% ఓట్లు రావడానికి చంద్రబాబే ముఖ్య కారణమని పేర్కొన్నారు నాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి చూసి ఓర్వలేని చంద్రన్న ముఖ్యమంత్రి జగన్  పై చెడు అభిప్రాయం కలగడానికి ఇలా గుళ్లు, గోపురాలపై చంద్రబాబునాయుడు దాడులు చేయిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. త్వరలోనే నిజం వెలుగులోకి వస్తుందని గళమెత్తారు.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>