Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corna-vaccine272fe08d-2d1d-45ed-b68c-7a181a163adc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corna-vaccine272fe08d-2d1d-45ed-b68c-7a181a163adc-415x250-IndiaHerald.jpg ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. అయితే ఆ మహమ్మారిని అడ్డుకునేందుకు నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు తయారు చేసుకున్న ఏకైక ఆయుధం.. కరోనా వ్యాక్సిన్. ఇప్పటికే అనేకదేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్లను అక్కడి ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం 16వ తేదీ ..corna vaccine;policeకరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలా..? లేకుంటే ఏమవుతుంది..?కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలా..? లేకుంటే ఏమవుతుంది..?corna vaccine;policeTue, 19 Jan 2021 11:28:51 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. అయితే ఆ మహమ్మారిని అడ్డుకునేందుకు నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు తయారు చేసుకున్న ఏకైక ఆయుధం.. కరోనా వ్యాక్సిన్. ఇప్పటికే అనేకదేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్లను అక్కడి ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై దేశవ్యాప్తంగా ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలా..? ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది..? రెండు డోస్‌లలో ఒకటే తీసుకుంటే ఏమవుతుంది..? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలపై ప్రముఖ వైద్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సోకినా, లేకున్నా ప్రజలంతా కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొవిడ్‌-19 వచ్చినవారిలో సహజంగానే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఉంటుందని, అయితే ఇది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది కచ్చితంగా తెలియదని వారంటున్నారు. వివిధ అధ్యయనాల్లో కూడా సరైన ఫలితాలు అందలేదని చెప్పారు. కొంతమందిలో 4 నెలల వరకు, మరికొంతమందిలో 6-8 నెలల వరకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా నివారిస్తుందా? లేదా ఒకవేళ వైరస్ మళ్లీ సోకినా ప్రభావం ఎక్కువ కాకుండా చూస్తుందా? మరణాలను ఆపుతుందా? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అందువ్లల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అందరిలో ఇమ్యూనిటీ పెరిగి వైరస్ సంక్రమణ తగ్గడమే కాకుండా దాని ప్రభావం కూడా క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ అత్యంత వేగంగా జన్యుపరమైన మార్పులు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిదనేది నిపుణుల సూచన. వ్యాక్సిన్ తీసుకోవటం వ్యక్తిగత అభిప్రాయమని, ఇది నిర్బంధమేమీ కాదని, కానీ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి సమస్యలతో బాధపడుతన్న వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని, అలాంటి వారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

తొలివిడతలో వైద్య సిబ్బంది.. పోలీసులు, రెవెన్యూ, పురపాలక ఉద్యోగులు.. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడ్డవారికి.. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ అందజేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను రెండు మోతాదుల్లో తీసుకోవాలని, తొలి విడత తరువాత 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలని చెబుతున్నారు.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>