MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/filmy-newsaf31be7f-c8ae-4426-a90c-f73adbe5626a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/filmy-newsaf31be7f-c8ae-4426-a90c-f73adbe5626a-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్ హావా పెరిగింది. బడా సినిమాలు కూడా ఓటీటీ లో విడుదలవుతూ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచాయి. బాలీవుడ్ లో బడా హీరోలు సైతం ఓటీటీ లో వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న "తాండవ్‌" వెబ్‌ సిరీస్‌ రగడ ముదురుతోంది. హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వెబ్‌సిరీస్‌ తీశారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. filmy news;ali;bharatiya janata party;bollywood;amazon;director;shiv sena;vegetable marketహిందూ మతం పై ముదిరిన వివాదం.. క్షమాపణలు చెప్పి వెబ్ సిరీస్ టీం..!!హిందూ మతం పై ముదిరిన వివాదం.. క్షమాపణలు చెప్పి వెబ్ సిరీస్ టీం..!!filmy news;ali;bharatiya janata party;bollywood;amazon;director;shiv sena;vegetable marketTue, 19 Jan 2021 08:00:00 GMTమార్కెట్ పరిధిని పెంచాయి. బాలీవుడ్ లో బడా హీరోలు సైతం ఓటీటీ లో వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న "తాండవ్‌" వెబ్‌ సిరీస్‌ రగడ ముదురుతోంది. హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వెబ్‌సిరీస్‌ తీశారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

అటు బీజేపీ, శివసేన నేతలు కూడా భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్‌ డైరెక్టర్ అలీ అబ్బాస్‌పై ఈ సిరీస్ లో నటించిన మరికొంతమంది నటులపై కూడా లక్నోలో కేసు నమోదైంది. హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ బ్యాన్‌ చేయాలంటూ అమెజాన్‌ ప్రైమ్‌కి నోటీసులు వెళ్లాయి. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో తాండవ్‌ టీమ్‌ క్షమాపణలు చెప్పింది. ఏ మతం , కులం, సెంటిమెంట్లను కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పింది "తాండవ్‌" చిత్ర బృందం తెలిపింది. ఈ సిరీస్ ద్వారా ఎవరినైనా కించపరిచి ఉంటే క్షమించమని కోరింది.

ఇదిలా ఉండగా తాండవ్‌ వివాదంపై ఐ అండ్‌ బీ మినిస్టరీ దృష్టి సారించింది. ఈ వెబ్‌సిరీస్‌పై వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాఖ.. తాండవ్‌ టీమ్‌ను వెంటనే వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఈ వెబ్ సిరీస్ పై బిజెపి నేతలు మొదటినుండి గుర్రుగానే ఉన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను వెంటనే అమెజాన్‌ ప్రైమ్‌ నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే అమెజాన్‌ ప్రైమ్‌పై తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.తాండవ్‌ వివాదంతో ఓటీటీని రెగ్యూలేట్‌ చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. ఈ  దిశగా ఐ అండ్‌ బీ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేపట్టింది. మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా రాబోయే రోజుల్లో సెన్సార్ ఉంటుందేమో చూడాలి.


భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!

అధికార పార్టీకి అభ్యర్థులే లేరు!

రోజా ఎఫెక్ట్‌: వైసీపీలో ఈక్వేష‌న్లు మారుతున్నాయ్‌..!

కర్నూలు పాలిటిక్స్‌లో ట్విస్ట్: టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన జ‌స్వంతి ఎవ‌రు...!

'లవ్ స్టోరీ' మాములుగా కాదట ...... ఫరెవర్ స్టోరీలా నిలిచిపోనుందట.....??

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీపార్వతి ప్రకటనకు షాక్ అయిన నందమూరి ఫ్యామిలీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>