- Kabali Fame Dhansika’s Neragadu To Release In Feb (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఇళయరాజా సంగీతం ముఖ్య ఆకర్షణగా గారపాటి మూవీ క్రియేషన్స్ కబాలి ఫేమ్ ధన్సిక నటించిన "నేరగాడు" ఫిబ్రవరి ప్రధమార్ధం విడుదల!!
తమిళంలో మంచి విజయం సాధించిన ఓ చిత్రం తెలుగులో 'నేరగాడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో విశేష అనుభవం కలిగిన యువ వ్యాపారవేత్త జి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని) ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. గారపాటి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ హారర్ ఎంటర్టైనర్ ను ఆయన నిర్మిస్తున్నారు. కబాలి ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.ఎస్.ఆర్.మూర్తి (చిన్ని) తెలిపారు. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా.. హారర్ కు యాక్షన్ అండ్ సెంటిమెంట్ జోడించిన "నేరగాడు".. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆయన అన్నారు.
వర్ణిక, వర్ష, శంకర్ శ్రీహరి, అనిల్ మురళి, నమో నారాయణ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మాటలు: నాగేశ్వరావు, పాటలు: రామారావు మాతుమూరు, సంగీతం: ఇళయరాజా, నిర్మాత: జి.వి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని), దర్శకత్వం: ఎస్.పాణి!!