MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-race749fe0d7-6711-4816-8510-16a99637dd73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-race749fe0d7-6711-4816-8510-16a99637dd73-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చిన తరువాత ఓపెన్ అయిన ధియేటర్స్ కు సంక్రాంతి పండుగ సీజన్ కలిసి రావడంతో కరోనా బయాలను పక్కకు పెట్టి ప్రేక్షకులు ధియేటర్స్ కు రావడంతో ధియేటర్లు అన్నీ కొంతవరకు కళకళలాడాయి. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనల వల్ల ఈసారి సంక్రాంతి సీజన్ లో విడుదల అయిన పండుగ సినిమాలకు చెప్పుకోతగ్గ స్థాయిలో కలిసిరాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి.ఈ పండుగ సీజన్ కు విడుదలైన సినిమాలకు వచ్చిన ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు మాత్రమే కనిపించారని 50 సంవత్సరాలు sankranthi race;kranthi;kranti;tara;makar sakranti;cinema;sankranthi;festival;industryథియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !sankranthi race;kranthi;kranti;tara;makar sakranti;cinema;sankranthi;festival;industryTue, 19 Jan 2021 10:00:00 GMTకరోనా పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చిన తరువాత ఓపెన్ అయిన ధియేటర్స్ కు సంక్రాంతి పండుగ సీజన్ కలిసి రావడంతో కరోనా బయాలను పక్కకు పెట్టి ప్రేక్షకులు ధియేటర్స్ కు రావడంతో ధియేటర్లు అన్నీ కొంతవరకు కళకళలాడాయి. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనల వల్ల ఈసారి సంక్రాంతి సీజన్ లో విడుదల అయిన పండుగ సినిమాలకు చెప్పుకోతగ్గ స్థాయిలో కలిసిరాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి.


పండుగ సీజన్ కు విడుదలైన సినిమాలకు వచ్చిన ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు మాత్రమే  కనిపించారని 50 సంవత్సరాలు దాటినా వ్యక్తులు అదేవిధంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఇంకా సినిమాలకు దూరంగానే ఉన్నారు అన్న అంచనాలు వస్తున్నాయి. కేవలం సంక్రాంతి పండుగ సీజన్ కలిసి వచ్చింది కాబట్టి ఈమాత్రం హడావిడి అయినా సినిమా ధియేటర్ల దగ్గర కనిపించిందని ఇప్పుడు పండుగ సీజన్ పూర్తి అయిన తరువాత ధియేటర్లలో ప్రేక్షకులు కనిపించడం చాల కష్టం అన్నఅంచనాలకు ఇండస్ట్రీ వర్గాలు వచ్చాయి.


టాప్ హీరోలు నటించే 100 కోట్ల బడ్జెట్ సినిమాలకు ఈకలక్షన్స్ ఏమాత్రం సరిపోవని అంటున్నారు. సంక్రాంతి సీజన్ కు విడుదలైన నాలుగు సినిమాల ధియేటర్ హక్కులను 60 కోట్ల రేంజ్ లో అమ్మకం అయితే ఇప్పటివరకు ఈ పండుగ సీజన్ కలిసి వచ్చిన గ్రాస్ కలక్షన్స్ 80 కోట్లు దాటలేదు అన్న అంచనాలు వస్తున్నాయి.


ఈసారి సంక్రాంతి సీజన్ కు విడుదలైన పండుగ సినిమాలు అన్నింటినీ బయ్యర్లకు అతి తక్కువ రేట్లకు అమ్మారు. దీనితో వస్తున్న ఒక మోస్తరు కలక్షన్స్ వలన కొంతవరకు బయ్యర్లు గట్టెక్కుతారు కానీ సంక్రాంతి తరువాత మొదలయ్యే ఈ వారంలో ఈసంక్రాంతి సినిమాలకు వచ్చే కలక్షన్స్ ను బట్టి ఎంతవరకు బయ్యర్లు గట్టెక్కుతారు అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పండుగ సీజన్ లో వచ్చిన సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే పండుగ అయిన తరువాత ఈ నెలలో విడుదల కాబోతున్న మరికొన్ని సినిమాలకు కనీసపు కలక్షన్స్ వస్తాయా ? రావా అన్న భయంలో ఇండస్ట్రీ వర్గాలుమదనపడుతున్నాయి..




ఒకేసారి రెండు చిత్రాలను చేయనున్న మెగాస్టార్..?

కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

నేడు కాళేశ్వ‌రానికి కేసీఆర్‌... ఢిల్లీకి జ‌గ‌న్‌..

ఆ వాహనాలకు శుభవార్త వినిపించిన కేంద్రం..!!

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>