MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-decesssion-on-pavan-becomes-news2d6d56cf-dd23-46cd-9c17-40b211a108a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-decesssion-on-pavan-becomes-news2d6d56cf-dd23-46cd-9c17-40b211a108a9-415x250-IndiaHerald.jpgహాట్ యాంకర్ అనసూయ పవన్ విషయంలో గతంలో చేసిన పొరపాటును మరొకసారి చేయకుండా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘అత్తారింటికి దారేది’ మూవీ నిర్మాణం జరుపుకుంటున్న సమయంలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించమని స్వయంగా త్రివిక్రమ్ అడిగినా తాను ఐటమ్ సాంగ్ లో చేయనని చెప్పి ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో పవన్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చి అప్పట్లో పవర్ స్టార్ అభిమానులు అనసూయను విపరీతంగా ట్రోల్ చేసారు.అయితే ఇప్పుడు జరిగిన పొరపాటును గ్రహించి అనసూయ నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తునpavankalyan;pawan;view;anasuya bharadwaj;kalyan;m m keeravani;pawan kalyan;trivikram srinivas;cinema;tamil;industry;attharintiki daredi;anasuya 1పవన్ కళ్యాణ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అనసూయ !పవన్ కళ్యాణ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అనసూయ !pavankalyan;pawan;view;anasuya bharadwaj;kalyan;m m keeravani;pawan kalyan;trivikram srinivas;cinema;tamil;industry;attharintiki daredi;anasuya 1Tue, 19 Jan 2021 12:00:00 GMTఅనసూయ పవన్ విషయంలో గతంలో చేసిన పొరపాటును మరొకసారి చేయకుండా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘అత్తారింటికి దారేది’ మూవీ నిర్మాణం జరుపుకుంటున్న సమయంలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించమని స్వయంగా త్రివిక్రమ్ అడిగినా తాను ఐటమ్ సాంగ్ లో చేయనని చెప్పి ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో పవన్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చి అప్పట్లో పవర్ స్టార్ అభిమానులు అనసూయను విపరీతంగా ట్రోల్ చేసారు.


అయితే ఇప్పుడు జరిగిన పొరపాటును గ్రహించి అనసూయ నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం క్రిష్ పవన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కు అనసూయ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేసిన ఒక భారీ సెట్ లో ఈ ఐటమ్ సాంగ్ ను క్రిష్ పవన్ అనసూయల పై త్వరలో చిత్రీకరిస్తాడని వార్తలు వస్తున్నాయి.




‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పూర్తి కావడంతో ఇప్పుడు పవన్ ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక షెడ్యూల్ ను పూర్తిచేసి ఆతరువాత అయ్యప్పన్ కొషియమ్’ షూటింగ్ వైపు వెళ్లిపోతాడని అంటున్నారు. ప్రస్త్తుతం అనసూయ ఒకవైపు తన బుల్లితెర షోలను కొనసాగిస్తూ తనకు వచ్చిన సినిమా అవకాశాలు అన్నీ వరసపెట్టి ఒప్పుకుంటున్నట్లు టాక్. అనసూయకు కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ మళయాళ ఇండస్ట్రీ నుండి కూడ అవకాశాలు వస్తూ ఉండటంతో ప్రస్తుతం ఆమె హవా బాగా కొనసాగుతోంది.


అనసూయ పవన్ తో నటించబోయే ఈ ఐటమ్ సాంగ్ ట్యూనింగ్ ను ఇప్పటికే కీరవాణి పూర్తిచేసి ఆ పాటను రికార్డు కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పుకోతగ్గ డాన్సర్ కాదు. అదేవిధంగా అనసూయ కూడ సరైన డాన్సర్ కాదు. కానీ వీరిద్దరి కాంబినేషన్ ను సెట్ చేస్తూ ఇప్పుడు క్రిష్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఈ మూవీకి కలిసి వస్తుందో చూడాలి..  





కమల్ హాసన్‌కు సర్జరీ.. లేఖ విడుదల చేసిన కూతుళ్లు, వైద్యులు

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

షాకింగ్: బిజెపి కొత్త ఛానల్... జై శ్రీరాం

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>