PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court40dfd33e-2a4b-4a8a-a2a0-658cca086bd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court40dfd33e-2a4b-4a8a-a2a0-658cca086bd2-415x250-IndiaHerald.jpgముగిసిపోయిందనుకున్న స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్ళీ పొడిగింపు అయ్యింది. కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కు ఈ విషయంలో బుద్ధి చెప్పేలా సరైన తీర్పు ఇచ్చింది. దాంతో నిమ్మగడ్డ ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిందే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి నిమ్మగడ్డ తిరుగుబాటు తో మరోసారి ఈ విషయంలో వెయిట్ చేయక తప్పట్లేదు.. ఏపీ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ మరికొన్ని రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హై కోర్టు డివిజనల్ బెంచ్ తీర్పుhigh court;tiru;andhra pradesh;panchayati;local language;chief commissioner of electionsరిజర్వ్ లో స్థానిక ఎన్నికల అంశం.. తెగని పంచాయితీ..?రిజర్వ్ లో స్థానిక ఎన్నికల అంశం.. తెగని పంచాయితీ..?high court;tiru;andhra pradesh;panchayati;local language;chief commissioner of electionsTue, 19 Jan 2021 21:23:52 GMTస్థానిక ఎన్నికల పంచాయితీ మళ్ళీ పొడిగింపు అయ్యింది.  కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కు ఈ విషయంలో బుద్ధి చెప్పేలా సరైన తీర్పు ఇచ్చింది. దాంతో నిమ్మగడ్డ ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిందే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి నిమ్మగడ్డ తిరుగుబాటు తో మరోసారి ఈ విషయంలో వెయిట్ చేయక తప్పట్లేదు.. ఏపీ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ మరికొన్ని రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హై కోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది తెలియాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ నెల 8వ తేదీన షెడ్యూల్‌ జారీ చేశారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేదుకు అనుగుణంగా.. ఈ నెల 23. 27. 31 తేదీల్లో వరుసగా తొలి, రెండు, మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్, వచ్చే నెల 4న నాలుగో దశ నోటిఫికేషన్‌ జారీ చేసేలా షెడ్యూల్‌ ప్రకటించారు. వచ్చే నెల 5, 7, 9, 17 తేదీల్లో ఉదయం 6:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 3: 30 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అయితే దీన్ని సవాల్ గా తీసుకుని  ప్రభుత్వం కరోనా విస్తరణ దృష్ట్యా సాధ్యం కాదంటూ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు షెడ్యూల్ నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. మూడు రోజుల పాటు ఇరు వైపుల వాదనలను ధర్మాసనం ఆలకించింది. వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్‌ చేసింది.ఈ వ్యవహారంలో తమను కూడా ఇంప్లీడ్‌ చేయాలని ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పిటిషన్లను అనుమతించబోమని తేల్చిచెప్పింది.


కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>