MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-new-movie-first-look4f765e1a-17bd-4f82-95ca-70cc2b06bb6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-new-movie-first-look4f765e1a-17bd-4f82-95ca-70cc2b06bb6f-415x250-IndiaHerald.jpgఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని చాలా కసిగా చూపించారు. కండలు తిరిగిన దేహంతో వరుణ్ లుక్ అదుర్స్ అనిపించింది. ఈ చిత్రంతో కొత్త డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చాడు వరుణ్. varun tej new movie first look;pawan;ram charan teja;kumaar;geetha;kalyan;pawan kalyan;ram pothineni;thaman s;varun;varun sandesh;varun tej;cinema;sangeetha;director;hero;posters;bobby;adhurs;chitram'గని' గా బాక్సింగ్ రింగ్ లో దిగుతున్న వరుణ్ తేజ్..!'గని' గా బాక్సింగ్ రింగ్ లో దిగుతున్న వరుణ్ తేజ్..!varun tej new movie first look;pawan;ram charan teja;kumaar;geetha;kalyan;pawan kalyan;ram pothineni;thaman s;varun;varun sandesh;varun tej;cinema;sangeetha;director;hero;posters;bobby;adhurs;chitramTue, 19 Jan 2021 15:17:15 GMTహీరో వరుణ్ తేజ్ నూతన చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ కాగా... ఇప్పుడు మరో తాజా వార్త ఈ సినిమాకి మరింత హైప్ పెంచింది. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే... ఈ సందర్భంగా ఈరోజు మేకర్స్ ముందుగానే చెప్పిన ప్రకారం 'VT10' ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. అదే విధంగా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మెగా బ్రదర్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వరుణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ లో కోలాహలం నెలకొంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది... ఈ చిత్రానికి "గని" అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈమధ్య బాబాయ్ పవర్ స్టార్ ను టైటిల్ విషయంలో బాగా ఫాలో అవుతున్నారు వరుణ్ తేజ్. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో పవన్ పేరు గని. ఇప్పుడు వరుణ్ తేజ్ నటిస్తున్న నూతన చిత్రంలో కూడా వరుణ్ పాత్ర పేరు గని.

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని  చాలా కసిగా చూపించారు. కండలు తిరిగిన దేహంతో వరుణ్ లుక్ అదుర్స్ అనిపించింది. ఈ చిత్రంతో కొత్త డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చాడు వరుణ్. కొర్రపాటి కిరణ్‌ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ గని ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌ - అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మరి ఇన్నిప్రత్యేకతలున్న ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే...


షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?

షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై

వేర్ ఈజ్ ఉమా కొనసాగుతున్న హై డ్రామా !

అమెరికా కొత్త అధ్యక్షుడికి ప్రాణ హాని...!

షాకింగ్: ఉమాకు పది సార్లు ఫోన్ చేసిన కొడాలి నానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>