PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/devineniumaf1826490-cc68-4265-8e2c-a36cae4896fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/devineniumaf1826490-cc68-4265-8e2c-a36cae4896fb-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మంత్రి కొడాలి నాని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై విమర్శలు చేయడం.. ఆ విమర్శలకు స్పందిస్తూ దేవినేని ఉమా దీక్ష చేస్తానంటూ సోమవారం సవాల్ విసిరారు. ఆయన అన్న విధంగానే గొల్లపూడి devineniuma;ntr;nani;editor mohan;kodali nani;krishna;vamsi;krishna river;vijayawada;devineni avinash;district;government;police;court;history;vallabhaneni vamsi;mla;minister;arrest;thief;tdp;traffic police;ycp;butter;nandamuri taraka rama rao;devineni uma maheswara rao;gharshana;dongaఅలా జరిగితే ఈ రాత్రంతా దేవినేని ఉమా పోలీస్ స్టేషన్‌లోనే.. రేపు కోర్టుకు..అలా జరిగితే ఈ రాత్రంతా దేవినేని ఉమా పోలీస్ స్టేషన్‌లోనే.. రేపు కోర్టుకు..devineniuma;ntr;nani;editor mohan;kodali nani;krishna;vamsi;krishna river;vijayawada;devineni avinash;district;government;police;court;history;vallabhaneni vamsi;mla;minister;arrest;thief;tdp;traffic police;ycp;butter;nandamuri taraka rama rao;devineni uma maheswara rao;gharshana;dongaTue, 19 Jan 2021 13:29:00 GMTకృష్ణా జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మంత్రి కొడాలి నాని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై విమర్శలు చేయడం.. ఆ విమర్శలకు స్పందిస్తూ దేవినేని ఉమా దీక్ష చేస్తానంటూ సోమవారం సవాల్ విసిరారు. ఆయన అన్న విధంగానే గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు రాగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందే తెలిసే దేవినేని ఉమా దొంగ దీక్షకు సిద్దమయ్యాడంటూ మంత్రి కొడాలి నాని మరోసారి దేవినేని ఉమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా గొల్లపూడికి చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

గొల్లపూడి సెంటర్‌లో ఒకపక్క టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తుండగానే.. వల్లభనేని వంశీ మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలుగు వాడి చరిత్ర దేశంలో లికించి ఎన్టీఆర్ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారంటూ అనంతరం మీడియాతో వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరని, చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ వేరని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన దేవినేని ఉమా రాజకీయాల్లో  విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ వంశీ అన్నారు. దేవినేని ఉమా ఒక లోఫర్ అంటూ వంశీ ఆయనపై సంచలన విమర్శలు చేశారు. దేవినేని ఉమా ప్లేస్, టైమ్, డేట్ ఫిక్స్ చెయ్యాలని, తాము చర్చకు సిద్దంగా ఉన్నామని వంశీ కూడా సవాల్ విసిరారు.

సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా తాము ఎప్పుడూ సిద్దమేన్నారు. అసంబద్దమైన ఆరోపణలు చేసి చర్చకు అంటే ఎలా అని ఆయన నిలదీశారు. తాము చర్చ పెట్టుకుందామని చెప్పాం కాని కొట్లాటకు రమ్మని ఎక్కడా చెప్పలేదని వంశీ అన్నారు. దేవినేని ఉమా ఏమీ తక్కువ తినలేదు... ఆయన తక్కువ మాట్లాడతాడు అని తాము అనుకోవడం లేదన్నారు. అవతలి వాళ్లను ఒకటి అని.. తిరిగి రెండు అనిపించుకోవడం దేవినేని ఉమాకు అలవాటు అని అన్నారు. ఇక చంద్రబాబు గురించి కూడా వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వంశీ చెప్పారు. గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో తనకు తెలుసన్నారు. కాగా.. దేవినేని ఉమాను పోలీసులు పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక వేళ ఆయనపై కేసు నమోదు చేస్తే ఈ రోజు రాత్రి స్టేషన్లోనే ఉంచి, రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.




రవితేజ కధతో రిస్క్ చేస్తోన్న డైరెక్టర్

ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న చిరంజీవి!

అందరున్నా ఒంటరై పోయిన హీరో..!

సోనుసూద్ అంబులెన్సులు

షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>