PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap17ad8205-a21a-430d-8198-fbe47e9b1c80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap17ad8205-a21a-430d-8198-fbe47e9b1c80-415x250-IndiaHerald.jpgబీజేపీకి రాముడుకు మంచి అనుబంధం ఉంది. అలాగే బీజేపీకీ రధ యాత్రలకు కూడా మంచి లింక్ ఉంది. అయోధ్య రాముడి కోసం 1990 లలో అద్వానీ జరిపిన రాధ యాత్ర నాటి దేశ రాజకీయాలనే సమూలంగా మార్చివేసింది. ఇపుడు ఏపీలో కూడా బీజేపీ అదే ఫార్ములా వాడబోతోంది. ap;ramu;tara;tiru;bharatiya janata party;somu veerraju;andhra pradesh;district;tirupati;media;husband;ayodhya;yatra;dookuduఏపీలో అద్వానీ వారసుడు ?ఏపీలో అద్వానీ వారసుడు ?ap;ramu;tara;tiru;bharatiya janata party;somu veerraju;andhra pradesh;district;tirupati;media;husband;ayodhya;yatra;dookuduTue, 19 Jan 2021 10:30:00 GMTఅయోధ్య రాముడి కోసం 1990 లలో అద్వానీ జరిపిన రాధ యాత్ర నాటి దేశ రాజకీయాలనే సమూలంగా మార్చివేసింది. ఇపుడు ఏపీలో కూడా బీజేపీ అదే ఫార్ములా వాడబోతోంది.

మరి బీజేపీ రధ యాత్రకు సారధి ఎవరు ఉంటారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. తిరుపతి కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ రధ యాత్ర అంటూ ప్రకటించడం వరకూ బాగానే ఉన్నా వారం రోజుల పాటు సాగే ఈ రధ యాత్రను ఎవరు చేపడుతారు అన్నదే ఇక్కడ చర్చ.

బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజు సహజంగా రధ యాత్రకు సారధి అని వినిపిస్తోంది. ఆయన రధ యాత్ర పేరిట ఏపీ నాలుగు చెరగుల తిరగడం అన్నది కచ్చితంగా జరిగితే మాత్రం బీజేపీలో ఆయన ప్లేస్ ని మార్చే వారు ఎవరూ ఉండరు సరి కదా ఆయన బలమైన నేతగా ఆవిర్భవిస్తారు.

అయితే రధ యాత్ర సూపర్ హిట్ అయితేనే ఇదంతా జరిగేది. రధ యాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాలలో ఉన్న జనాలను ఉద్దేశించి మాట్లాడాలి. వారి సమస్యలు ప్రస్తావించాలి. ఒక విధంగా అనర్గళంగా మాట్లాడుతూ జనాలను ఆకట్టుకోవాలి. మరి బీజేపీలో రధ సారధి ఎవరు అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉందిట.

సోము వీర్రాజు మీడియా సమావేశాల వరకూ బాగానే మాట్లాడుతారు. అయితే ఆయన ఇంత పెద్ద ప్రొగ్రాం ఎపుడూ టేకప్ చేయలేదు. ఆయన సారధి కాబట్టి ఆయనే రధాన్ని ఎక్కితే ఎలా ఉంటుంది రియాక్షన్ అన్న చర్చ కూడా ఉంది. ఆయన కాకపోతే మంచి వాగ్దాటి కలిగిన  వారు ఆ పార్టీలో ఇంకా ఎవరు ఉన్నారు అన్నది కూడా చర్చగా ఉందిట. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజుని కాదని ఎవరూ ముందుకు రారు అంటున్నారు. మరి నాటి అద్వానీని మరపించేలా సోము రధాన్ని ముందుకు దూకుడుగా తీసుకుపోగలరా, ఏపీ రాజకీయాలను మార్చగలరా. చూడాల్సిందే.




ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !

టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌ల వార్‌... కేటీఆర్ వ‌ద్ద‌కు పంచాయితీ...!

కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

నేడు కాళేశ్వ‌రానికి కేసీఆర్‌... ఢిల్లీకి జ‌గ‌న్‌..

ఆ వాహనాలకు శుభవార్త వినిపించిన కేంద్రం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>