PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vacciened4c2912a-aa58-4227-95cf-fa31bd4bf2d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vacciened4c2912a-aa58-4227-95cf-fa31bd4bf2d3-415x250-IndiaHerald.jpgవైద్యులు, వైద్య సిబ్బందిలో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం, వ్యాక్సిన్‌ వద్దని తిరస్కరించడం అసంతృప్తి కలిగించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని, అలాంటి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కొందరు హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు ముందుకు రాకపోవడం బాధాకరమని చెప్పారుcovid vacciene;health;rakshita;niti aayog;doctor;central governmentకోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటనకోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటనcovid vacciene;health;rakshita;niti aayog;doctor;central governmentTue, 19 Jan 2021 21:32:07 GMT
కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిలో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం, వ్యాక్సిన్‌ వద్దని తిరస్కరించడం అసంతృప్తి కలిగించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని, అలాంటి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కొందరు హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు ముందుకు రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఉపద్రవం ఏ రూపం తీసుకుంటుందో తెలియదని, అందువల్ల వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు రావాలని వీకే పాల్ పిలుపునిచ్చారు.

      కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ల వల్ల దుష్ప్రభావాలు, విషమ పరిస్థితులు ఎదుర్కొన్న పరిణామాలు అంతగా లేవని, ఈ రెండు వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని డాక్టర్ పాల్ చెప్పారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందన్న అపోహల నుంచి హెల్త్ కేర్ వర్కర్లు బయటపడాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆయన తెలిపారు.

          దేశవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకూ 6.31 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం వరకూ.. టీకా తీసుకున్న వారిలో 580 మందిలో దుష్ప్రభావాలు కనిపించినట్లు పేర్కొంది. అయితే.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యూపీలో ఒకరు, కర్ణాటకలోని బళ్లారిలో ఒకరు మరణించారని.. అయితే వారి మృతికి ఇతర అనారోగ్య సమస్యలే కారణమని తేలినట్లు కేంద్రం ప్రకటించింది.


  


జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

వివాదాల్లో యశ్‌.. విజయ్‌ సేతుపతి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>