PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinaf23eca99-991c-4f09-8299-2c444badb6d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinaf23eca99-991c-4f09-8299-2c444badb6d6-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ఏదైనా చిటికెలో తెలిసిపోతోంది. ఇప్పుడు మన పక్కలో బల్లెమైన చైనా ఆగడాలను కూడా ఉపగ్రహ టెక్నాలజీ బయటపెడుతోంది. సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్నది శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసిపోతోంది. తాజా చైనా భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చి చేసిన దురాక్రమణను శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి. చైనా మన భూబాగంలోకి వచ్చి ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించిన ఉదంతం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సరిహద్దుకు 4.china;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;2019;villageదీనెమ్మ చైనా.. డ్రాగన్‌ కుట్రను శాటిలైట్‌ చిత్రాలు..!?దీనెమ్మ చైనా.. డ్రాగన్‌ కుట్రను శాటిలైట్‌ చిత్రాలు..!?china;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;2019;villageTue, 19 Jan 2021 09:35:49 GMT టెక్నాలజీ పుణ్యమా అని ఏదైనా చిటికెలో తెలిసిపోతోంది. ఇప్పుడు మన పక్కలో బల్లెమైన చైనా ఆగడాలను కూడా ఉపగ్రహ టెక్నాలజీ బయటపెడుతోంది. సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్నది శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసిపోతోంది. తాజా చైనా భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చి చేసిన దురాక్రమణను శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి.

చైనా మన భూబాగంలోకి వచ్చి ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించిన ఉదంతం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టింది. ప్లానెట్‌ ల్యాబ్స్‌ గతేడాది నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చైనా దురాక్రమణపై ఎన్డీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారిచూ నది ఒడ్డున ఈ గ్రామం ఉన్నది. ఈ ప్రాంతంపై చైనా, భారత్‌ల మధ్య  1959 నుంచి వివాదం ఉన్నది. 2019 ఆగస్టు 26వ తేదీన తీసిన ఫొటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఏకంగా ఓ ఊరు కనిపించింది.. అంటే ఒక్క ఏడాదిలోనే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఏకంగా ఓ గ్రామం నిర్మించిందన్నమాట.

ఇప్పుడు ఈ దురాక్రమణపై మీడియాలో కథనాలు రావడంతో భారత్ ఆచితూచి స్పందించింది. ఉపగ్రహ చిత్రాలు వార్తాచానళ్లలో ప్రసారం కావడంతో వివరణ ఇచ్చింది. సరిహద్దుల్లో ప్రజల జీవన సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత ప్రభుత్వం రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నదని పేర్కొన్నది. దేశ సరిహద్దుల వద్ద అన్ని వేళలా నిఘా ఉంటుందని, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. అయితే సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ ప్రకారం చూసినా చైనా నిర్మించిన ఈ గ్రామం భారత భూభాగంలోనే ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.




ఒకేసారి రెండు చిత్రాలను చేయనున్న మెగాస్టార్..?

కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

నేడు కాళేశ్వ‌రానికి కేసీఆర్‌... ఢిల్లీకి జ‌గ‌న్‌..

ఆ వాహనాలకు శుభవార్త వినిపించిన కేంద్రం..!!

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>