PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నా సరే కొంత మంది లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీ నేతలే అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని విపక్షాల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల విys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;local language;ycpవీళ్ళకు జగన్ మాటైనా లెక్క లేదా...?వీళ్ళకు జగన్ మాటైనా లెక్క లేదా...?ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;chief minister;local language;ycpTue, 19 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నా సరే కొంత మంది లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీ నేతలే అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని విపక్షాల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం ప్రజల్లో చులకన అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వైసీపీ స్థానిక నేతలు చేస్తున్న తప్పుల కారణంగా విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని అంటున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో వైసీపీ సర్కార్ సీరియస్ గా ఉన్నా సరే లబ్ధిదారులను కొంతమంది తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసిపికి అనుకూలంగా లేనివారిని అలాగే ఇతర పార్టీలతో సన్నిహితంగా ఉండేవారని ఇప్పుడు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

దీనితో ముఖ్యమంత్రి జగన్ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి కొంతమంది అధికారులను క్షేత్రస్థాయిలో పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పాదయాత్ర చేసే సమయంలో రాజకీయాలు చూడను రాజకీయాలు చేయను అని  సీఎం జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని కారణంగా ప్రజల్లో వైసీపీ చులకన అవుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ కూడా బలపడాలని భావిస్తుంది. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.


దేవినేని ఉమా దీక్ష.. మరోసారి ఘాటు విమర్శలు చేసిన కొడాలి నాని

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>