PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/attchanaidu-sensational-comments-on-cm-jagane1b24efd-9106-4a70-928e-2567070d2d47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/attchanaidu-sensational-comments-on-cm-jagane1b24efd-9106-4a70-928e-2567070d2d47-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు వర్సెస్ మంత్రులుగా పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో కాస్త భిన్నమైన పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. తాజాగా కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. దేవినేని ఉమాని తాను కొడతా అని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే... తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. బూతుల మంత్రినattchham naidu, kaodali nani, ycp, ap;ntr;amarnath cave temple;jagan;andhra pradesh;devineni avinash;police;letter;tdp;nandamuri taraka rama rao;reddy;bonda umamaheswara rao;mantraకొడాలి నానీపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలుకొడాలి నానీపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలుattchham naidu, kaodali nani, ycp, ap;ntr;amarnath cave temple;jagan;andhra pradesh;devineni avinash;police;letter;tdp;nandamuri taraka rama rao;reddy;bonda umamaheswara rao;mantraTue, 19 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు వర్సెస్ మంత్రులుగా పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో కాస్త భిన్నమైన పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. తాజాగా కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. దేవినేని ఉమాని తాను కొడతా అని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే... తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

బూతుల మంత్రిని రాష్ట్రంపై ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారు అని ఆయన ఆరోపణలు చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆదీనంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా? అని నిలదీశారు. కొడాలి నానీ  వాగుడు రోగం చివరి దశకు చేరింది అని అన్నారు. ఇష్టాను సారంగా ఎవరినిపడితే వాళ్లను మాట్లాడుతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసారు.

శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమామహేశ్వర రావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారు.?  అని నిలదీశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి  అని ఆరోపించారు. వాటిని పరిష్కరించడం చేతకావడం లేదు అని విమర్శించారు. ప్రజలు తంతారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు అని ఆయన ఆరోపించారు. జనం ముందుకు నానీ వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు అని అన్నారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు అని ఆరోపణలు చేసారు.


గాయలతో కీలక ఆటగాళ్లు.. జట్టు ఎంపిక ఎట్టా ఉంటాదో..?

గతంలో వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లు ఎంతమందో తెలుసా...?

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..

ఆ దుంప తింటే క్యాన్సర్ ను అరికట్టవచ్చు?

వావ్: పోలవరం బాధ్యతలు తీసేసుకుంటున్న కేంద్రం

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>