PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronafc8c25cd-b9e8-487d-bbf3-df99b3a0b018-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronafc8c25cd-b9e8-487d-bbf3-df99b3a0b018-415x250-IndiaHerald.jpgచీమ దూరే సందు ఉంటే చాలు చొరబడిపోతుంది కరోనా మహమ్మారి. మనుషులు జీవించే ప్రతీ ప్రాంతాన్ని కరోనా పలకరించి వెళుతుందా..? అన్నట్లు తయారైంది. కరోనా ఛాయలు లేని ప్రాంతంలోకి పాకిపోతుంది. నిన్నటి వరకు కరోనా బూచితొంగి చూడని ప్రాంతం అదొక్కటే. దేశంలో అన్ని రాష్ట్రాలూ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నా.. ఆ ఒక్క కేంద్రపాలిత ప్రాంతం మాత్రం దీటుగా నిలబడింది అదే లక్షద్వీప్. భారతదేశంలో అతి స్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.corona;manu;kerala;lakshadweep;india;january;capital;december;arabian sea;sea;indianచివరకు అక్కడకీ చేరింది కరోనాచివరకు అక్కడకీ చేరింది కరోనాcorona;manu;kerala;lakshadweep;india;january;capital;december;arabian sea;sea;indianTue, 19 Jan 2021 12:23:56 GMTకేరళ తీరం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం. ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. అక్కడ ఒక్క కేసు రాకుండా అధికారులు ఇన్నాళ్లు జాగ్రత్తపడ్డారు. అందుకు ఎన్నెన్నో భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడికీ కరోనా చేరింది. మొదటి కేసు నమోదైంది.
                                                         సోమవారం తొలిసారిగా లక్షద్వీప్ లోని కవరట్టిలో కరోనా మొదటి కేసు నమోదైంది. అక్కడి కొవిడ్ ఆస్పత్రికి ఆ పేషెంట్ ను తరలించి చికిత్స చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన వ్యక్తిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన వంటవాడిగా గుర్తించినట్టు వెల్లడించాయి. జనవరి 4న ఓడలో లక్షద్వీప్ కు బయల్దేరాడని, దాదాపు రెండు వారాల తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలిందని వెల్లడించాయి. ట్రూనాట్ టెస్టింగ్ ద్వారా అతడికి కరోనా ఉన్నట్టు సిబ్బంది నిర్ధారించారు. ప్రస్తుతం అతడు కలిసిన వారి గురించి అధికారులు ఆరా తీస్తూ జల్లెడ పడుతున్నారు. అందరూ కవరట్టిలోనే ఉండి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరికొందరికీ కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
                                                                                     గతేడాది డిసెంబర్ 28న క్వారంటైన్ నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. కొచ్చి సహా లక్షద్వీప్ లోనూ క్వారంటైన్ అవసరం లేకుండానే ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ఆ నిబంధన మార్చిన మూడు వారాల్లోనే అక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలనే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.


గాయలతో కీలక ఆటగాళ్లు.. జట్టు ఎంపిక ఎట్టా ఉంటాదో..?

గతంలో వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లు ఎంతమందో తెలుసా...?

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..

ఆ దుంప తింటే క్యాన్సర్ ను అరికట్టవచ్చు?

వావ్: పోలవరం బాధ్యతలు తీసేసుకుంటున్న కేంద్రం

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>