PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/shock-will-that-area-in-karnataka-be-merged-with-maharashtrae47982ff-aff6-4cdf-a1aa-32db94db0e97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/shock-will-that-area-in-karnataka-be-merged-with-maharashtrae47982ff-aff6-4cdf-a1aa-32db94db0e97-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే క‌ర్నాక‌ట స‌రిహ‌ద్దులో ఉన్న బెళ‌గావి ప్రాంతాన్ని తిరిగి బాంబేలో క‌ల‌పాల‌ని అక్క‌డ ప్ర‌జ‌లు కోరుతున్నారు. వారంతా మ‌రాఠీయే మాట్లాడ‌తారు. అప్ప‌ట్లో బెళ‌గావి ప్రాంతాన్ని క‌ర్నాక‌ట‌లో క‌ల‌ప‌డంపై మ‌హారాష్ట్ర‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు జ‌రిగాయి. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు దీనికి వ్యతిరేకంగా గ‌ళ‌మెత్తారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దాదాపు 10 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడ‌వ ఇలా జ‌రుగుతూ ఉండ‌గానే తాజాగా ఇది రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. maharashtra cm;mumbai;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;uddhav thackeray;media;cm;king;maharashtra;letterషాక్‌: క‌ర్నాట‌క‌లో ఆ ప్రాంతం మ‌హారాష్ట్ర‌లో క‌లిపేస్తారా ?షాక్‌: క‌ర్నాట‌క‌లో ఆ ప్రాంతం మ‌హారాష్ట్ర‌లో క‌లిపేస్తారా ?maharashtra cm;mumbai;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;uddhav thackeray;media;cm;king;maharashtra;letterTue, 19 Jan 2021 17:38:50 GMTమ‌న దేశంలో చాలా రాష్ట్రాల మ‌ధ్య స‌రిహ‌ద్దు గొడ‌వ‌లు.. ప్రాంతాల గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ గొడ‌వ‌ల వ‌ల్లే దేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయాయి. అంతెందుకు తెలుగు జాతి రెండు ముక్క‌లు అయ్యి ఏపీ, తెలంగాణ‌గా విడిపోయింది. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ గొడ‌వ‌లు ఇలాగే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర - క‌ర్నాక‌ట రాష్ట్రాల మ‌ధ్య ఇప్పుడు స‌రిహ‌ద్దు వివాదం న‌డుస్తోంది. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు క‌ర్నాక‌ట‌, మ‌హారాష్ట్ర‌లో కొన్ని ప్రాంతాలు నైజాం పాల‌న‌లో ఉండేవి. ఇక ఇప్పుడు క‌ర్నాక‌ట‌లో ఉన్న కొన్ని ప్రాంతాలు బాంబే ప్రావిన్స్‌లో ఉండేవి. అయితే ఆ త‌ర్వాత వాటిని క‌ర్నాక‌ట‌లో క‌లిపారు. ఇక నైజాం పాల‌న‌లో ఉన్న బీద‌ర్‌, బ‌ళ్లారి, రాయ‌చూర్ క‌ర్నాక‌ట‌లో క‌లిశాయి.

ఇక ఇదే నైజాం పాల‌న‌లో ఉన్న ఔరంగాబాద్‌, ధ‌ర్మాబాద్‌, నాసిక్‌, నాందేడ్ మ‌హారాష్ట్ర‌లోకి వెళ్లిపోయాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్నాక‌ట స‌రిహ‌ద్దులో ఉన్న బెళ‌గావి ప్రాంతాన్ని తిరిగి బాంబేలో క‌ల‌పాల‌ని అక్క‌డ ప్ర‌జ‌లు కోరుతున్నారు. వారంతా మ‌రాఠీయే మాట్లాడ‌తారు. అప్ప‌ట్లో బెళ‌గావి ప్రాంతాన్ని క‌ర్నాక‌ట‌లో క‌ల‌ప‌డంపై మ‌హారాష్ట్ర‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు జ‌రిగాయి. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు దీనికి వ్యతిరేకంగా గ‌ళ‌మెత్తారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దాదాపు 10 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ గొడ‌వ ఇలా జ‌రుగుతూ ఉండ‌గానే తాజాగా ఇది రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన మెసేజ్ చేశారు. కర్ణాటక ఆధీనంలో ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతామని ఆయన సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య వివాదం రాజుకుంది. దీనిని క‌ర్నాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప తీవ్రంగా ఖండిస్తున్నారు. బెళ‌గావి ప్రాంతం ఎప్ప‌ట‌కీ క‌ర్నాక‌ట‌లోనే ఉంటుంద‌ని చెపుతున్నారు. ఓ ప్రాంతం కోసం ఏకంగా ఇద్ద‌రు సీఎంలు మాట‌ల యుద్ధానికి దిగ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయ వేడి రాజుకోనుంది.  


చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఈ నలుగురు హీరోలు ఒకే సమస్యతో బాధపడుతున్నారట

ఎన్డియేలోకి తెరాస ఖాయం...?

ఆర్ఆర్ఆర్ తాజా అప్డేట్: ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు పండగ లాంటి వార్త

తెరాస ఎంపీ జంప్...?

షాకింగ్: ఖమ్మం జిల్లా నేతకు బిజెపి సిఎం సీటు ఆఫర్

బాబోయ్ అనంతపురం జిల్లాలో నాటు బాంబులట.. మరి అవి ఎవరిని చంపడానికి చేశారో తెలుసా?

టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు.. కేసీఆర్‌పై తనదైన శైలిలో రేవంత్ విమర్శలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>