MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-look-from-f3-movie-gets-positive-response1808c9a4-ed0d-4a54-a827-a74119f48829-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-look-from-f3-movie-gets-positive-response1808c9a4-ed0d-4a54-a827-a74119f48829-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు అనిల్ రావిపూడి. ఈయన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే అనిల్ దర్శకత్వంలో నటించడానికి చాలా మంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేయగా.. varuntej;venkatesh;anil music;anil ravipudi;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;2019;cinema;sankranthi;hushaaru;media;f2;twitter;industry;director;comedy;success;posters;f3మెగా ప్రిన్స్‌కు ఎఫ్3 టీం విషెస్.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..మెగా ప్రిన్స్‌కు ఎఫ్3 టీం విషెస్.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..varuntej;venkatesh;anil music;anil ravipudi;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;2019;cinema;sankranthi;hushaaru;media;f2;twitter;industry;director;comedy;success;posters;f3Tue, 19 Jan 2021 18:51:35 GMTటాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు అనిల్ రావిపూడి. ఈయన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే అనిల్ దర్శకత్వంలో నటించడానికి చాలా మంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేయగా.. వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ 2019 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గతంలోనే ప్రకటించాడీ డైరెక్టర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సీక్వెల్.. వేసవి కానుకగా విడుదల అవుతుందని అనుకుంటున్నారు. డైరెక్టర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవలే ఎఫ్3 షూటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఫస్ట్ డే నుండే వెంకటేష్ షూట్ లో పాల్గొంటున్నాడు. హైదరాబాదులో వేసిన ప్రత్యేక ఇంటి సెట్ లో ఎఫ్3 షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వరుణ్ తేజ్ కరోనా బారినపడి కోలుకున్నాడు. ఇటీవలే వరుణ్ కూడా షూటింగులో చేరిపోయాడు.

అయితే వరుణ్ సెట్ లో పాల్గొన్న సందర్బంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా తనతో దిగిన పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చాడు. అలాగే 'సెట్ లోకి స్వాగతం.. ఇప్పుడు అసలు ఫన్ మొదలైంది' అంటూ ట్వీట్ చేసాడు. ఈరోజు వరుణ్ పుట్టిన రోజు అని తెలుసుగా. ఈ సందర్బంగా ఎఫ్3 టీమ్ సోషల్ మీడియా వేదికగా వరుణ్ కొత్త పిక్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. దీనిపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఫోటో చూస్తే వరుణ్ చాలా హుషారుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అలాగే షూటింగ్ కూడా చకచకా పూర్తి చేసేస్తోందట టీం. ఇక వరుణ్ ఎఫ్3 సినిమాతో పాటు గని సినిమా కూడా చేస్తున్నాడు. ఈరోజే గని మూవీ నుండి కూడా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. బాక్సర్ గా వరుణ్ లుక్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.


కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>