PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trafficbfd849ea-15ba-4d04-b3b8-824edd754bef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trafficbfd849ea-15ba-4d04-b3b8-824edd754bef-415x250-IndiaHerald.jpgరష్యా రాజధాని మాస్కో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా 54 శాతంగా ఉందని టామ్ టామ్ నివేదిక తెలిపింది. భారత వాణిజ్య రాజధాని ముంబై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు, మన దేశంలో మొదటి స్థానంలో నిలిచిందిtraffic;mumbai;delhi;india;russia;turkey;colombia;ukraine;capital;moscow;2020;bengaluru 1;survey;population;tom banton;tom hooperవరల్డ్ టాప్ టెన్ ట్రాఫిక్ నగరాలు!వరల్డ్ టాప్ టెన్ ట్రాఫిక్ నగరాలు!traffic;mumbai;delhi;india;russia;turkey;colombia;ukraine;capital;moscow;2020;bengaluru 1;survey;population;tom banton;tom hooperTue, 19 Jan 2021 19:31:41 GMTజనాభా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి.  అయితే వలసలకు తగ్గట్లు మౌలిక వసతుల కల్పన నగరాల్లో సాధ్యం కావట్లేదు. దీంతో నగరాలు, పట్టణాల్లో రద్దీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ దారుణంగా ఉంటోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలోని నగరాల్లోని  ట్రాఫిక్ రద్దీ  అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఆరు ఖండాలు, 57 దేశాల్లో మొత్తం 416 నగరాలపై ఈ సర్వే చేశారు. 2020 సంవత్సరంలో సగటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న పది నగరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మూడు భారత నగరాలు కూడా ఉన్నాయి.

            రష్యా రాజధాని మాస్కో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా 54 శాతంగా ఉందని టామ్ టామ్ నివేదిక తెలిపింది. భారత వాణిజ్య రాజధాని ముంబై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు, మన దేశంలో  మొదటి స్థానంలో నిలిచింది. ముంబై రోడ్లపై వాహనాల ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా ఉంది.కొలంబియా కేపిటల్  బొగోటా  53 శాతం ట్రాఫిక్ రద్దీతో మూడో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో రాజధాని మనీలాలో ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా నమోదైంది. టర్కీ రాజధాని  ఇస్తాంబుల్  ట్రాఫిక్ రద్దీ  51 శాతంతో  ప్రపంచ నగరాల్లో ఐదో స్థానంలో ఉంది.  

             భారత్ ఐటీ నగరం బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది.బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువున్న ఆరో నగరంగా సర్వేలో నిలిచింది బెంగళూరు. ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. భారత రాజధాని ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశంలో  మూడవ స్థానంలో, మొత్తం జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మన రాజధానిలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 47 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ వెల్లడించింది. రష్యాలోని  నోవోసిబిర్స్క్ నగరం ట్రాఫిక్ రద్దీ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నోవోసిబిర్స్క్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ స్థాయి 45 శాతంగా నమోదైంది. ఇక టూరిజానికి ప్రసిద్ధి చెందిన బ్యాంకాక్‌ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడి రోడ్లపై సగటు ట్రాఫిక్ రద్దీ 44 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ తెలిపింది. 


కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>