PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr02e07495-5da6-48a1-83c9-a2fd8f4ab31b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr02e07495-5da6-48a1-83c9-a2fd8f4ab31b-415x250-IndiaHerald.jpgఎన్టీయార్ అంటేనే ఒక చరిత్ర. ఆయన పేరు సాహసానికి మారుగా చెప్పాలి. ఆయనకు సాటి పోటీ నాడూ నేడూ ఎవరూ లేరని కూడా గట్టిగా చెప్పవచ్చు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు. సెట్ ఉన్నపుడు న్యూస్ పేపర్ కూదా చదవడానికి ఇష్టపడని ఎన్టీయార్ సీరియస్ గా పాలిటిక్స్ లోకి రావడం అంటే అది కచ్చితంగా విధి విలాసమే అనుకోవాలి. ntr;ntr;jeevitha rajaseskhar;ramu;tiru;january;tirupati;chief minister;history;chennai;husband;silver;butter;silver screen;partyఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?ntr;ntr;jeevitha rajaseskhar;ramu;tiru;january;tirupati;chief minister;history;chennai;husband;silver;butter;silver screen;partyMon, 18 Jan 2021 10:00:00 GMTఎన్టీయార్ అంటేనే ఒక చరిత్ర. ఆయన పేరు సాహసానికి మారుగా చెప్పాలి. ఆయనకు సాటి పోటీ నాడూ నేడూ ఎవరూ లేరని కూడా గట్టిగా చెప్పవచ్చు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు. సెట్ ఉన్నపుడు న్యూస్ పేపర్ కూదా చదవడానికి ఇష్టపడని ఎన్టీయార్ సీరియస్ గా పాలిటిక్స్ లోకి రావడం అంటే అది కచ్చితంగా విధి విలాసమే అనుకోవాలి.

ఎన్టీయార్ సినీ చరిష్మా ఎవరికీ అందనిది. అందరు హీరోలకూ అభిమానులు ఉంటారు. కానీ ఎన్టీయార్ కి మాత్రం భక్తులు ఉండేవారు. ఆయన్ని వెండి తెర మీద రాముడుగా క్రిష్ణుడుగా చూసుకుని పులకించి పోయేవారు. ఎన్టీయార్ ని చూడడానికి తిరుపతి నుంచి మద్రాస్ లో ఆయన ఇంటికి ప్రత్యేకంగా వాహనాల్లో వెళ్ళేవారంటే ఆయన మీద భక్తి ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఎవరికైనా జీవితంలో ఒకసారి మోసం జరుగుతుంది. మరోసారి అది జరగకుండా జాగ్రత్తపడతారు. కానీ ఎన్టీయార్ విషయంలో మాత్రం రెండు సార్లు మోసం జరిగింది. అదే వెన్నుపోటు. ఆయనను 1984లో నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి పదవి లాక్కుని అధికారం నుంచి కూలదోస్తే రెండవమారు అంటే 1995 ఆగస్టులో సొంత కుటుంబ సభ్యులే తిరుగుబాటు చేసి మరీ గద్దె నుంచి దించేశారు.

అయితే రెండవమారు జరిగిన వెన్నుపోటు గురించి  కొంతమంది ఆంతరంగీకులు ఎన్టీయార్ ని ముందే హెచ్చరించారని నాడు ప్రచారం జరిగింది. అయితే ఎన్టీయార్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదని అంటారు. తన అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు అని కలలో సైతం రామారావు అనుకోలేదు. పైగా ఆయనకు కుటుంబం అంటే అంత నమ్మకం. కానీ  జరిగింది వేరుగా ఉంది. ఆయనను  సొంత వారే వేరుగా మారి పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఆయన్ని తొలగించడం తెలుగు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఒక విషాద ఘట్టం. ఎన్టీయార్ ఆ మీదట  మనోవేదనతోనే నాలుగున్నర నెలలు బతికారు. 1996 జనవరి 18న ఆయన మరణించారు. ఎన్టీయార్ ని తలచుకుంటే ఆయన సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు, ఆయన చివరి రోజుల్లో పడిన వేదన కూడా గుర్తుకు వస్తాయి.




ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారా?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!

ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>