PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో చ‌ర్చ‌ల అనంత‌రం టీడీపీలో చేరి.. ఆ పార్టీనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల్లో పెద్ద యాక్టివ్‌గా అయితే ఉండ‌డం లేదు. చంద్ర‌బాబు ఎన్నోసార్లు రాజాంలో పార్టీ వీక్‌గా ఉంద‌ని.. యాక్టివ్ అవ్వాల‌ని సూచించినా కూడా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకున్నట్టు క‌న‌ప‌డ‌డం లేదు. స్థానికంగా కూడా పార్టీ కార్య‌క్ర‌మాల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గంతో ఆయ‌న‌కు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. క‌ళా ను కాద‌ని tdp chandra babu;greeshma;raja;visakhapatnam;andhra pradesh;2019;district;vishakapatnam;minister;cycle;letter;tdp;local language;yuva;ycp;partyఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!tdp chandra babu;greeshma;raja;visakhapatnam;andhra pradesh;2019;district;vishakapatnam;minister;cycle;letter;tdp;local language;yuva;ycp;partyMon, 18 Jan 2021 09:05:00 GMTఏపీలో అధికారం కోల్పోయాక టీడీపీ ప‌డుతోన్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే కాకుండా.. ప‌లువురు నేత‌లు సైతం సైకిల్ దిగి ఏ వైసీపీలోకో లేదా బీజేపీలోకో వెళ్లిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీకి చెందిన ఓ యువ మాజీ మంత్రి సైతం ఇప్పుడు సైకిల్ దిగేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఎవ‌రో కాదు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కొండ్రు ముర‌ళీ. కాంగ్రెస్‌లో ఉండ‌గా ఎచ్చెర్ల‌, రాజాం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రెండు సార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత వైఎస్ ద‌య‌తో మంత్రి అయ్యారు. జిల్లాలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లాంటి సీనియ‌ర్ నేత ఉన్నా కూడా ముర‌ళీ త‌న‌కంటూ ఓ వ‌ర్గం ఏర్పాటు చేసుకుని రాజ‌కీయం చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సైలెంట్ అయిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో చ‌ర్చ‌ల అనంత‌రం టీడీపీలో చేరి.. ఆ పార్టీనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల్లో పెద్ద యాక్టివ్‌గా అయితే ఉండ‌డం లేదు. చంద్ర‌బాబు ఎన్నోసార్లు రాజాంలో పార్టీ వీక్‌గా ఉంద‌ని.. యాక్టివ్ అవ్వాల‌ని సూచించినా కూడా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకున్నట్టు క‌న‌ప‌డ‌డం లేదు. స్థానికంగా కూడా పార్టీ కార్య‌క్ర‌మాల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గంతో ఆయ‌న‌కు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. క‌ళా ను కాద‌ని రాజాంలో రాజ‌కీయం చేసే ప‌రిస్థితి లేదు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప‌రిస్థితి బాగుంటుంద‌న్న ఆశ‌లు ఆయ‌న‌కు లేవ‌ట‌. మ‌రోవైపు ప్ర‌తిభా భార‌తి కుమార్తె గ్రీష్మ సైతం రాజాం రాజ‌కీయాల్లో యాక్టివ్ అవ్వాల‌నుకుంటున్నారు. ఇన్ని గ్రూపుల మ‌ధ్య తాను టీడీపీలో ఉన్నా ఉప‌యోగం లేద‌ని ముర‌ళీ భావిస్తున్నార‌ట‌. అందుకే ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లార‌ని అంటున్నారు. పైగా రాజాం వైజాగ్‌కు ద‌గ్గ‌ర్లోనే ఉంటుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు వైజాగ్ రాజ‌ధాని అంశం బాగా ప్ర‌భావితం చేస్తోంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలే ముర‌ళీ పార్టీ మారాల‌న్న ఆలోచ‌న‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని అంటున్నారు. 


రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>