HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fried-foods504590c8-21da-4651-90ad-7ac3c841cb27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fried-foods504590c8-21da-4651-90ad-7ac3c841cb27-415x250-IndiaHerald.jpgనోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ ను టేస్ట్ చేయకుండా ఎవరు ఉండగలరు చెప్పండి. పొటాటో ఫ్రైస్ అనేవి అడిక్టింగ్ ఫుడ్. కేవలం ఒకటి తిని ఊరుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఒకటి తరువాత ఒకటి ఒకటి తరువాత ఒకటి ఇలా టేస్ట్ చేస్తూ ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసేస్తూ ఉంటారు. బర్గర్ లేదా పిజ్జాతో పాటు ఫ్రైస్ ను మీరు ఆర్డర్ చేస్తూ ఉంటారా? ఐతే, మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. fried foods;burger;french fries;korcha;heart;fats;carbohydrates;cholesterolఫ్రైస్ తింటే మైండ్ బ్లాకవుతుందటఫ్రైస్ తింటే మైండ్ బ్లాకవుతుందటfried foods;burger;french fries;korcha;heart;fats;carbohydrates;cholesterolMon, 18 Jan 2021 16:00:00 GMTఫ్రెంచ్ ఫ్రైస్ ను టేస్ట్ చేయకుండా ఎవరు ఉండగలరు చెప్పండి. పొటాటో ఫ్రైస్ అనేవి అడిక్టింగ్ ఫుడ్. కేవలం ఒకటి తిని ఊరుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు.

ఒకటి తరువాత ఒకటి ఒకటి తరువాత ఒకటి ఇలా టేస్ట్ చేస్తూ ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసేస్తూ ఉంటారు. బర్గర్ లేదా పిజ్జాతో పాటు ఫ్రైస్ ను మీరు ఆర్డర్ చేస్తూ ఉంటారా? ఐతే, మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి.

ఫ్రైస్ ను ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై నెగటివ్ ఎఫెక్ట్స్ పడతాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో పబ్లిషైన స్టడీ ప్రకారం వారంలో  రెండు కంటే ఎక్కువసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ ను తింటే ఎర్లీ డెత్ రిస్క్ అనేది రెట్టింపవుతుందట. దాదాపు, 4,500 మందిపై కండక్ట్ చేసిన ఈ స్టడీలో ఈ విషయం వెల్లడైంది.

కార్బ్స్ అలాగే ప్రోటీన్ తో పోల్చితే శరీరం ఫ్యాట్స్ ను స్లోగా డైజెస్ట్ చేసుకుంటుంది. అందువల్ల, హెల్తీ ఫుడ్ కంటే ఎక్కువ సమయం ఈ ఫ్రైస్ అనేవి పొట్టలో కూర్చుంటాయి.  అల్ట్రా సౌండ్ ఇంటర్నేషనల్ ఓపెన్  జర్నల్ లో పబ్లిషైన స్టడీ ప్రకారం ఫ్రైడ్ ఫుడ్స్ తింటే కడుపునొప్పి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ లో ఈ ఫ్రైస్ ను ఫ్రై చేయడం జరుగుతుంది. అందుకే, వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో, హార్ట్ డిసీస్ రిస్క్ పెరిగే ప్రమాదం ఎక్కువ. ఇంకో స్టడీ ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్ ను ఎక్కువగా తీసుకుంటే అల్జీమర్స్ అలాగే డిమెన్షియా బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువని తేలింది.

కరెంట్ ఒపీనియన్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిక్ కేర్ లో పబ్లిషైన ఇంకో స్టడీ ప్రకారం, హై ఫ్యాట్ కలిగిన గ్రీజీ డైట్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందని తేలింది.

ఆహారాలని ఫ్యాట్ లో ఫ్రై చేస్తే అవి కేలరీ బాంబ్స్ గా మారతాయి. దాంతో, వెయిట్ గెయిన్ సమస్య పెరుగుతుంది. అందుకే, ఫ్రైడ్ ఫుడ్స్ కి అలాగే ఒబెసిటీకి లింక్ ఉందంటున్నారు.


నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

ఐశ్వర్య రాజేష్ నిజ జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే

వర్ధంతి: ఎన్టీఆర్ చనిపోయాక..ఎయిర్ పోర్ట్ నుండి ఉగ్ర పులిలా హరికృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>