EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/free-class-fifth-pg0f4963c0-ebc8-45f4-b45c-9d23a33e92d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/free-class-fifth-pg0f4963c0-ebc8-45f4-b45c-9d23a33e92d7-415x250-IndiaHerald.jpgపూర్వంలో చదువులకు రూ.1000 పెట్టామంటే చాలు అది అందరికి చర్చనీయాంశాంగా మారేది. అప్పట్లో డబ్బుకు, చదువుకు అంత ప్రాముఖ్యం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో కనీసం పిల్లలకు ఎల్కేజీ నుంచి యూకేజీ చదివించాలన్నా కూడా మధ్యతరగతి కుటుంబాలకు చాలా కష్టంగా మారుతోంది. ఇక పీజీ వరకు అంటే వారి ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యాసంస్థలు చదువులను వ్యాపారంగా మారుస్తున్నాయి. పిల్లలు బడికి వెళ్ళి చదవాలంటేనే ఫీజులు కట్టలేక వెనుకడుగు వేస్తున్నారు. కేవలం చదువుకోవాలన్న తపన మాత్రమే వారిని ముందుకు తీసుకెళుతోంfree,class,fifth,pg;amala akkineni;vidya;telangana;scheduled caste;university;degreeఫిఫ్త్ టూ పీజీ ఫ్రీ అంటున్న విద్యాసంస్థలు!ఫిఫ్త్ టూ పీజీ ఫ్రీ అంటున్న విద్యాసంస్థలు!free,class,fifth,pg;amala akkineni;vidya;telangana;scheduled caste;university;degreeMon, 18 Jan 2021 18:00:00 GMTపూర్వంలో చదువులకు రూ.1000 పెట్టామంటే చాలు  అది అందరికి చర్చనీయాంశాంగా మారేది. అప్పట్లో డబ్బుకు, చదువుకు అంత ప్రాముఖ్యం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో కనీసం పిల్లలకు ఎల్కేజీ   నుంచి యూకేజీ చదివించాలన్నా కూడా  మధ్యతరగతి కుటుంబాలకు చాలా కష్టంగా మారుతోంది. ఇక పీజీ వరకు అంటే వారి ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యాసంస్థలు చదువులను వ్యాపారంగా మారుస్తున్నాయి. పిల్లలు బడికి వెళ్ళి చదవాలంటేనే ఫీజులు కట్టలేక వెనుకడుగు వేస్తున్నారు. కేవలం చదువుకోవాలన్న తపన మాత్రమే వారిని ముందుకు తీసుకెళుతోంది. సరిగ్గా ఇలాంటి తపన,పట్టుదల ఉన్న విద్యార్థులకు గురుకుల సంస్థలు శుభవార్త తెలిపాయి.

మొన్నటి వరకు గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఐదవ తరగతి నుంచి  ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉచితంగా చదువుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే ఆ తర్వాత పై చదువులకు అయ్యే ఖర్చులను భరించలేమని తల్లిదండ్రులు వాపోతుంటే,అలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు నేర్పించాలన్న సంకల్పంతో మరో అడుగు ముందుకు వేసింది తెలంగాణ ప్రభుత్వం.

మునుపటి గురుకులాలు కొత్త రూపం సంతరించుకోవడంతో పాటు డిగ్రీ కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఇకపై పీజీ కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి. గురుకులాలలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టడంతో తెలంగాణ సర్కార్, గతంలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య స్కీం అమలు దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పవచ్చు. ప్రతిభ ఆధారంగా గురుకులాలకు ఎంపికైన విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పీ జీ  వరకు ఉచిత విద్యను అభ్యసించవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ గురుకుల సొసైటీ కి సంబంధించి,ఎంపికైన కాలేజీలలో పీజీ ప్రొఫెషనల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక సీ పీ జీ ఈ టీ  పరీక్షలో లభించే ర్యాంకుల ఆధారంగా గురుకులాలలో సీట్లు లభ్యమవుతాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 260 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఎస్సీ  గురుకుల సొసైటీ మూడు కళాశాల పరిధిలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు చేయగా,ఈ కోర్సు లకు తుది ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు న్యాయవిద్య కోర్సుకు సంబంధించి,బార్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువుల కోసం  మరింత సాహసం  చేసిందని చెప్పవచ్చు.




అంతర్వేదిలో దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>