PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/did-terrorists-target-india-from-afghan-soil4646960a-1f06-4e74-8877-6f18dc8f6811-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/did-terrorists-target-india-from-afghan-soil4646960a-1f06-4e74-8877-6f18dc8f6811-415x250-IndiaHerald.jpgతాలిబాన్ల‌తో అఫ్గ‌నిస్థాన్ ప్ర‌భుత్వం శాంతియుతంగా చ‌ర్చ‌లు జ‌రిపేందుకు అంగీక‌రించినా.. తాలిబాన్ల‌లోని ఓ వ‌ర్గం విఘాతం క‌లిగించేందుకు దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఇటీవలి కాలంలో ఆఫ్గనిస్తాన్లో వ‌రుస‌గా హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కాబూల్ లోని కొంత‌మంది ముఖ్య‌మైన నేత‌ల‌ను, అధికారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుపుతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన దాడిలో ఇద్దరు మహిళా జడ్జిలు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు మహిళా న్యాయమూర్తులు ఈ దాడుల్లో మ‌ర‌ణించారు. గుర్తుతterrorists;ahmed;capital;court;driver;local language;officeఅఫ్గ‌నిస్థాన్‌లో ఆగ‌ని మార‌ణ ‌హోం.. హై ప్రొఫెల్ వ్య‌క్తుల‌పై తాలిబాన్ల తూట‌...అఫ్గ‌నిస్థాన్‌లో ఆగ‌ని మార‌ణ ‌హోం.. హై ప్రొఫెల్ వ్య‌క్తుల‌పై తాలిబాన్ల తూట‌...terrorists;ahmed;capital;court;driver;local language;officeMon, 18 Jan 2021 08:47:52 GMTరాజధాని కాబూల్ లోని కొంత‌మంది ముఖ్య‌మైన నేత‌ల‌ను, అధికారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుపుతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన దాడిలో ఇద్దరు మహిళా జడ్జిలు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు మహిళా న్యాయమూర్తులు ఈ దాడుల్లో మ‌ర‌ణించారు.  గుర్తుతెలియని వ్యక్తులు వారిని కాల్చిచంపారు. వరుసగా జరుగుతున్న ఉన్నతస్థాయి వ్యక్తుల హత్యల్లో ఇది తాజా ఘటన.


దీనిపై సుప్రీంకోర్టుకు చెందిన వారు మాట్లాడుతూ.. సదరు మహిళా న్యాయమూర్తులు కోర్టు వాహనాల్లో తమ కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు దాడులు జరిగాయని, ఈ దాడుల్లో డ్రైవర్లు గాయపడ్డారని తెలిపారు. న్యాయమూర్తుల మృతదేహాలను పూర్తిస్థాయిలో ఇంకా గుర్తించబడలేదు. సెక్యూటిరీ ఫోర్సెస్‌ ద్వారా ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం కోర్టు వాహనంలో తమ ఆఫీసుకి బయల్దేరిన ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలపై ఆయుధాలు ధరించిన దుండగులు కాల్పులు జరిపారని ఆఫ్తాన్ అధికారులు తెలిపారు. దురుదృష్టవశాత్తూ ఈ దాడిలో ఇద్దరు జడ్జిలు మరణించారని..డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని సుప్రీంకోర్టు ప్రతినిధి అహ్మద్ ఫాహిమ్ క్వాయిమ్ తెలిపారు. ఆఫ్తాన్ సుప్రీంకోర్టులో 200మందికి పైగా మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నట్లు అహ్మద్ తెలిపారు.


అయితే.. ఈ ఘటనలో తాలిబన్ల ప్రమేయం లేదని తెలుస్తోంది. ఖతార్‌లో తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి. ఈ వరుస హత్యలకు తాలిబన్లే కారణమని ప్రభుత్వం కొన్నినెలలుగా ఆరోపిస్తోంది. కానీ, శాంతి చర్చలు అంటూనే ప్రభుత్వమే ఈ హత్యలకు పాల్పడి తమపై నెట్టేస్తోందని తాలిబన్లు మరోవైపు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌గని మాట్లాడుతూ.. స్థానిక పౌరులపై తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం, భయోత్పాతం, నేరాలతో ఆఫ్ఘనిస్తాన్‌కు పరిష్కారం కావని, 'శాశ్వత కాల్పుల విరమణే' పరిష్కారమని అభిప్రాయపడ్డారు.





ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>