PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/joe-biden-america-president-elections-trump-kamalade9b1893-39b6-4d1d-8764-4645c4f30988-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/joe-biden-america-president-elections-trump-kamalade9b1893-39b6-4d1d-8764-4645c4f30988-415x250-IndiaHerald.jpg జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ జో బైడన్ పాల‌న‌లో కీల‌క ప‌ద‌వుల్లో భార‌తీయుల‌కు చోటు క‌ల్పించడం గ‌మ‌నార్హం. ట్రంప్, మోదీ మధ్య బంధం కారణంగా ఇండియన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావించినా కూడా బైడన్ పటాపంచలు చేస్తూ భారత అమెరికన్లకు పట్టం కట్టారు. 1శాతం ఉన్న వర్గానికి పెద్దపీట వేస్తూ మొత్తం 20మందిని తన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఇప్పటికే నియమించ‌డం దాదాపు ఇదే తొలిసార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. biden;narendra modi;american samoa;white house;donald trump;government;january;bank;international;house;kamala harrisభారతీయుల‌కు బైడెన్ అగ్ర‌తాంబులం..పాల‌న‌లో కీల‌క ప‌ద‌వుల్లో అంతా మ‌నోళ్లే..భారతీయుల‌కు బైడెన్ అగ్ర‌తాంబులం..పాల‌న‌లో కీల‌క ప‌ద‌వుల్లో అంతా మ‌నోళ్లే..biden;narendra modi;american samoa;white house;donald trump;government;january;bank;international;house;kamala harrisMon, 18 Jan 2021 10:00:00 GMTజనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ జో బైడన్ పాల‌న‌లో కీల‌క ప‌ద‌వుల్లో భార‌తీయుల‌కు చోటు క‌ల్పించడం గ‌మ‌నార్హం.  ట్రంప్, మోదీ మధ్య బంధం కారణంగా ఇండియన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావించినా కూడా బైడన్ పటాపంచలు చేస్తూ భారత అమెరికన్లకు పట్టం కట్టారు. 1శాతం ఉన్న వర్గానికి పెద్దపీట వేస్తూ మొత్తం 20మందిని తన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఇప్పటికే నియమించ‌డం దాదాపు ఇదే తొలిసార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  పెద్ద సంఖ్యలో భారత సంతతి వ్యక్తులు శ్వేతసౌధంలో, కీలక ప్రభుత్వ పదవుల్లో నియమితుల‌వుతున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ భారతీయ మూలాలున్నవారే.


ఆమెనే కాక- తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెం దిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్‌ గతంలోనే వెల్లడించారు. అగ్రశ్రేణి పదవులకు ఎంపికైన ప్రముఖుల్లో నీరా టాండన్‌ ఒకరు. ఈమె ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మొత్తం 20 మంది భార‌త సంత‌తి టీంలో 13 మంది మహిళలే ఉండటం విశేషం. జో బైడన్, కమలా హారిస్ సారధ్యంలోని ప్రభుత్వంలో మనవాళ్లు విధులు నిర్వర్తిస్తారు. 20 మందిలో 17 మంది వైట్ హౌస్ లోనే ఉంటారు. వీరే కాకుండా ఇంకా క్యూలో కొందరన్నారు. ఇదిలా ఉండ‌గా  వైట్ హౌస్ టీమ్ లోకి కశ్మీరీ సంతతికి చెందిన సమీరా ఫజిలీని బైడెన్ సెలక్ట్ చేసుకున్నారు.


యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరక్టర్‌గా సమీరా ఫజిలీని బైడెన్ నియమించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో సమీరా ఫజిలీ…ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరక్టర్ గా పనిచేశారు. సమీరా ఫజిలీ..కశ్మీర్ వేర్పాటువాదాన్ని కోరుకునే ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ స్టాండ్ విత్ కశ్మీర్ స‌భ్యురాలు. 2019ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్-370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన సమయంలో స్టాండ్ విత్ కశ్మీర్  సభ్యురాలిగా ఫజిలిని ప్రవేశపెట్టింది.  మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టం మరియు ప్రజాస్వామ్యానికి మీ మద్దతును చూపించండి అని ఓ ప్రకటనలో ఫజిలీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


ఈ టీవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!

ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>