PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/highcourte1ed8aa0-9e24-4879-94ad-cb020781304a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/highcourte1ed8aa0-9e24-4879-94ad-cb020781304a-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల వివాదం రోజు రోజుకూ ముదిరి పోతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ ముగింపుకు వచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం తరపున మొదటి రౌండ్‌ వాదనలు పూర్తయ్యాయి. ఎస్‌ఈసీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారుhighcourt;kumaar;sriram;amaravati;andhra pradesh;adinarayanareddy;high court;panchayati;lawyer;local language;paritala sriramస్థానిక ఎన్నికలపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదాస్థానిక ఎన్నికలపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదాhighcourt;kumaar;sriram;amaravati;andhra pradesh;adinarayanareddy;high court;panchayati;lawyer;local language;paritala sriramMon, 18 Jan 2021 21:20:00 GMTఅమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల వివాదం రోజు రోజుకూ ముదిరి పోతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ ముగింపుకు వచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం తరపున మొదటి రౌండ్‌ వాదనలు పూర్తయ్యాయి. ఎస్‌ఈసీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రేపు ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదులు రిప్లై ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో విచారణను మంగళవారం ఉదయానికి ధర్మాసనం వాయిదా వేసింది.

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై రాష్ట్ర  ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడంతో.. డివిజన్ బెంచ్‌కు ఎన్నికల కమిషన్ అప్పీల్ చేసింది. దీంతో సోమవారం ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని బెంచ్.. ఈ కేసు విచారణను చేపట్టింది. సోమవారం మొదటి రౌండ్ వాదనలు విన్నది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడే స్థానిక ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఆదేశాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత కరోనా కాలంలో ఎన్నికల నిర్వహించడం ప్రమాదరకమని, కొంత కాలం ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తాజాగా హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా.. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌కు స్థానిక ఎన్నికలు అడ్డుగా ఉంటాయని, కొంత కాలం ఆగాలని తీర్పునిచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ తీర్పును మరోసారి సవాల్ చేసింది.


ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..!

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>