MoviesParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-great-personality-killed-again-by-untruth-biopics70404d50-69fc-4fd7-9033-14251720785d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-great-personality-killed-again-by-untruth-biopics70404d50-69fc-4fd7-9033-14251720785d-415x250-IndiaHerald.jpg"మ‌హాన‌టి" సినిమా సాధించిన విజ‌యం చూసి ‌కథానాయ‌కుడు, మహానాయకుడు సినిమాలను కూడా సావిత్రి బ‌యోపిక్ తో సమాన మౌతుందని ఆశించారు. ఈ సినిమా లేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు. ఆయన జీవిత చరిత్రపై తీసిన ఈ సినిమాలన్నీ ఆయన జీవితాన్ని ప్రతిబింబించలేక విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. ఆమహనీయుని జీవిత చరిత్రను చిత్రాలుగా తీసే నిజాయతీ నైతికత సమర్ధత ఎవరికీ లేదని తేలిపోయింది. తెరచిన పుస్తకంలా జనమెరిగినమహనీయుల జీవితచరిత్రలను మసిబూసి మారేడుకాయలు చేసి సినిమాలు చేసేవాళ్ళ చేతికి చిప్పలేనని ఋజువైంది ntr;ntr;balakrishna;jayanthi;ram gopal varma;shiva;arjuna;jeevitha rajaseskhar;krishna;madhura sridhar reddy;prasad;ram pothineni;ramu;rani;savitri;tiru;vishwa;virat kohli;telugu desam party;cinema;telugu;nandamuri balakrishna;tirupati;tamil;chief minister;ntr mahanayakudu;producer;history;sri krishna;hindi;director;lord siva;husband;producer1;hero;contract;silver;letter;traffic police;nandamuri taraka rama rao;silver screen;father;lavakusa;savithri 1;reddy;v;masala;mass;party;major chandrakanth;jayam;chitramబయోపిక్స్ లో ఆ మహానాయకుణ్ణి నిజాయతీగా చూపలేక మరోసారి చంపేశారుబయోపిక్స్ లో ఆ మహానాయకుణ్ణి నిజాయతీగా చూపలేక మరోసారి చంపేశారుntr;ntr;balakrishna;jayanthi;ram gopal varma;shiva;arjuna;jeevitha rajaseskhar;krishna;madhura sridhar reddy;prasad;ram pothineni;ramu;rani;savitri;tiru;vishwa;virat kohli;telugu desam party;cinema;telugu;nandamuri balakrishna;tirupati;tamil;chief minister;ntr mahanayakudu;producer;history;sri krishna;hindi;director;lord siva;husband;producer1;hero;contract;silver;letter;traffic police;nandamuri taraka rama rao;silver screen;father;lavakusa;savithri 1;reddy;v;masala;mass;party;major chandrakanth;jayam;chitramMon, 18 Jan 2021 10:30:45 GMTనేడు మహానటుడు, ప్రజానాయకుడు, బహుముఖ ప్రఙ్ఙాశాలి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 26వ జయంతి - సందర్భంగా ఆయనను స్మరించుకోవటం మనం ఆయనకు సరైన నివాళి, కృతఙ్ఞతలు తెలుకోవటమే అవుతుంది. 

వెండితెరపై అందాల రాముడు, కొంటె కృష్ణుడు, ఏడు కొండలవాసి వేంకటేశ్వరుడు, రావణ బ్రహ్మ, రారాజు సుయోధన, ఇలా ఏ నాయక ప్రతినాయక పౌరాణిక పాత్రనైనా ఆయన చేస్తేనే ఆ పాత్రకు పొందిక పొంకం పరిపూర్ణత పసందైన నిండుదనం వస్తుంది.తెలుగు ప్రజలందరి చేత ‘అన్నా’ అని సాధారణ ప్రజల చేత 'ఎంటీవోడు' అని పిలుపించు కున్నా అది మహానటుడు ఎన్టీఆర్ కే చెల్లింది. స్మృతి పథంలో ఎన్టీఆర్ వెండితెర కథానాయకుడే కాదు జన హృదిపథంలో మహానాయకుడుగా, ప్రజానాయకుడుగా నిలిచారు.

కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలేవైనా అతను నటిస్తే ఆ పాత్ర నిండుదనం సంతరించుకొంటుంది పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో కలకాలం చిరస్థాయిగా నిలిచారు.

అభిమానులు మధుర మనోహరంగా ఎన్టీఆర్ పిలుచునే నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, చిత్రానువాదకుడుగా, మాటల రచయితగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని అనేకానేక రంగాల్లో రాణించారు రికార్డులను సృష్టించారు.

నటరత్న నందమూరి తారక రామారావు సినిమాల్లోకి రాకముందే పలు కళావేదికలపై నాటకాలతో మంచి నటుడిగా రాణించారు. అతనిలోని నటుడ్ని గుర్తించిన  ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు "పల్లెటూరిపిల్ల" చిత్రంలో నటించే అవకాశం ఇచ్చాడు.

సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో "మనదేశం" సినిమాలో నటించే అవకాశం రావడం, దానిలో నటించటం, అది ముందుగా విడుదలవటంతో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ అయ్యింది. 1949లో వచ్చిన ఆ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు. ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది.

1950లోనే సుప్రసిద్ధ నాగిరెడ్డి & చ్హక్రపాణి ద్వయానికి చెందిన విజయా సంస్థ ఎన్టీఆర్, జానకి హీరో హీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో "షావుకారు" చిత్రం నిర్మించారు. ఎన్టీఆర్ తొలి రెండు దశాబ్ధాల్లోనే సగటున సంవత్సరానికి 10 చిత్రాలు చేస్తూ మొత్తం 200 పైగా సినిమాలలో నటించారు. అలాగే యేడాదికి తక్కువలో తక్కువ 10 సినిమాలు విడుదలయ్యేవి. నేటి నటుల్లో ఆస్థాయి చిత్రాల్లో నటించిన వారు కలికానికి కూడా కానరారు. ఖనిపించినా బహు అరుదు.

విజయా సంస్థ తో కుదిరిన ఒప్పందంతో  ఎన్టీఆర్ విజయా వారి ఆస్థాన నటుడు అయ్యారు. 1951 లో దక్షిణ భారతంలో “డైరెక్టర్ ది గ్రేట్ - అనదగ్గ దర్శకుడు కె.వి.రెడ్డి” దర్శకత్వంలో విజయా వారు నిర్మించిన "పాతాళ భైరవి" ఎన్టీఆర్‌ కు తిరుగులేని ప్రజాదరణ తీసుకొచ్చింది. 1956లో అదే కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించబడి విడుదలైన "మాయాబజార్" లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. దాంతో నటసార్వభౌమత్వమే సిద్ధించింది ఆ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి జనాన్ని మురిపించాడు.

రామారావు తొలిసారిగా రాముని పాత్రలో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. శ్రీరాముడుగా పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు, తమిళ చిత్రం "సంపూర్ణరామాయణం" లో.  ఆ తర్వాత 1963 లో విడుదలైన సంచలనం సృష్టించిన  "లవకుశ" ఇదో వెండితెర ఆణిముత్యం. శ్రీరాముడిగా ఎన్టీఆర్‌కు వెండితెర వేలుపుగా ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది.

1959లో ఎవియమ్ వారు నిర్మించిన ‘భూకైలాస్’చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు. అందులో రావణుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించాడు. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయాలు  సాధించడం విశేషం. తెలుగులో ఇంతటి అరుదైన రికార్డు ఎవరికీ లేదు.

అంతేకాదు ఆయన సినిమాలు మరోసారి విడుదలైనా మళ్లీ మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్ట గలగడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.

పౌరాణికాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించు కున్నాడు. 1977లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’తో ఎన్టీఆర్ పై ఉన్న జనాభిమానం ఎన్నో రెట్లు పెరిగింది.

అదే ఏడాది విడుదలైన ‘దాన వీర శూరకర్ణ’ను ఎవరూ మరిచి పోలేరు. అందులో ఆయన పోషించిన  శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించింది. అతను నటిస్తే ఏ పాత్రయినా పరిపూర్ణమవుతుంది అన్న దానికి ఉదాహరణే ‘దాన వీర శూర కర్ణ’

ఆ తర్వాత 1979 లో య‌న్టీఆర్  ‘శ్రీమద్విరాట్ విరాట్ పర్వం’లో 5 పాత్రలు శ్రీకృష్ణ, దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించు కున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివ శంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు.

అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగు తున్న దశలోనే  తాత, తండ్రి, మనవడు పాత్రల్లో – కులగౌరవం అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెర కెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయ చిత్రా లకు లెక్కేలేదు.

రాజకీయాల్లోకి వచ్చేముందు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి యన్టీఆర్ నటించి, సాధారణ ప్రేక్షకుణ్ణి ఉర్రూతలాడించిన ఆఖరి మాస్ మసాలా చిత్రంగా – నాదేశం -  నిలిచిపోయింది.

ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఘన చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్ ఐదు పాత్రలు పొషిస్తూ దర్శకత్వం చేసిన “శ్రీమద్విరాటపర్వం” ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్,  శ్రీనాథ కవిసార్వభౌమ లాంటి  చారిత్రక  పౌరాణిక  సాంఘిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.

యన్టీఆర్ తన 44 ఏళ్ళ  సినీ జీవితంలో 44 పౌరాణిక ,13 చారిత్రక, 55 జానపద మరియు 186 సాంఘిక  చిత్రాలలో నటించి  తెలుగు వెలుగు వెండి తెర పై చెరగని, ఎప్పటికీ  వన్నె తరగని తన చరిత్రను లిఖించుకున్నారు. అరుదైన ముద్ర వేసారు. అంతేకాదు పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు.

ఇక ఇటీవల ఆయన జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు,‘ఎన్టీఆర్ మహానాయకుడు, సినిమాలను తెరకెక్కించి విఫల ప్రయోగం చేశారు. అలాగే ఆయన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా రూపొందించాడు.

"మ‌హాన‌టి" సినిమా సాధించిన విజ‌యం చూసిన త‌ర్వాత క‌థానాయ‌కుడు, మహానాయకుడు సినిమాలను కూడా సావిత్రి బ‌యోపిక్ తో సమానమౌతుందని అభిమానులు ఆశించారు.సినిమా లేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు. ఆయన జీవిత చరిత్రపై తీసిన ఈ సినిమాలన్నీ ఆయన జీవితాన్ని ప్రతిబింబించలేక విఫల్య ప్రయోగాలుగా మిగిలిపోయాయి. ఆమహనీయుని జీవిత చరిత్రలను చిత్రాలుగా తీసే నిజాయతీ నైతికత సమర్ధత ఎవరికీ లేదని తేలిపోయింది.  

తెరచిన పుస్తకంలా జనమెరిగినమహనీయుల జీవిత చరిత్రలను మసి బూసి మారేడు కాయలు చేసి సినిమాలు నిర్మించే వాళ్ళ చేతికి చిప్పలే నని ఋజువైంది. ఏమైనా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ ది తిరుగులేని మహాప్రయాణం,  మహాప్రస్థానం అని చెప్పక తప్పదు.





చెప్పుల విషయంలో అవమానం.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయిన సముద్రఖని.. అదే జీవితాన్ని మార్చింది..

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>