MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multistarrer20879820-da82-4001-826f-7d000ebaefa6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multistarrer20879820-da82-4001-826f-7d000ebaefa6-415x250-IndiaHerald.jpgమలయాళంలో లూసిఫర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో తాను రీమేక్ చేయనున్నట్టు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చెప్పడం కూడా జరిగిపోయింది. తెలుగులో ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లూసీఫర్ తెలుగు వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనేmultistarrer;chiranjeevi;ram charan teja;shiva;allu arjun;editor mohan;koratala siva;pawan kalyan;pruthvi;raj;raja;ram pothineni;vijay;vijay deverakonda;cinema;telugu;huzur nagar;remake;lord siva;joseph vijay;arjun 1;devarakonda;chitramచిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?multistarrer;chiranjeevi;ram charan teja;shiva;allu arjun;editor mohan;koratala siva;pawan kalyan;pruthvi;raj;raja;ram pothineni;vijay;vijay deverakonda;cinema;telugu;huzur nagar;remake;lord siva;joseph vijay;arjun 1;devarakonda;chitramMon, 18 Jan 2021 15:46:01 GMTరీమేక్ చేయనున్నట్టు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చెప్పడం కూడా జరిగిపోయింది. తెలుగులో ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లూసీఫర్ తెలుగు వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే మెగాస్టార్ లూసిఫర్ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే లూసిఫర్ తెలుగు రీమేక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మలయాళంలో లూసిఫర్ చిత్రాన్ని పృథ్వీ రాజ్ డైరెక్ట్ చేయడమే కాకుండా.. ఆయన ఆ సినిమాలో ఓ కీలక పాత్రలోనూ నటించాడు. అయితే తెలుగు ఈ పాత్రను చేయబోయేది ఎవరనే దానిపై వివిధ పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాత్రను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్నాడనే వార్త ఎక్కువగా వినపడుతోంది. విజయ్ దేవరకొండతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా బాగానే వినపడుతోంది. అయితే ఈ వార్తలన్ని పుకార్లే అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుగులో పృథ్వీ రాజ్ క్యారెక్టర్‌ను తీసేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ క్యారెక్టర్ లేకుండా సినిమా కథ ముందుకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పైన చెప్పిన రెండు విషయాల్లోనూ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదు. విజయ్ దేవరకొండ లూసిఫర్‌లో నటించబోతున్నాడు అనే దానిపై కాని, అసలు పృథ్వీ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండదు అనే దానిపై కాని చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక వేళ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తే.. రౌడీ అభిమానులకు పండగే అని చెప్పాలి. కాగా.. ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ద అనే క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో ఆచార్యపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 


ఈ విత్తనాలను ఉమ్మేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు.

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

ఐశ్వర్య రాజేష్ నిజ జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే

వర్ధంతి: ఎన్టీఆర్ చనిపోయాక..ఎయిర్ పోర్ట్ నుండి ఉగ్ర పులిలా హరికృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>