MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ligere27f5b5a-82f1-4736-a9f3-ead8825a7820-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ligere27f5b5a-82f1-4736-a9f3-ead8825a7820-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి చిత్రంతో తన కంటూ తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ఆయన సినిమా పోస్టర్ నుంచి సినిమా విడుదల వరకు ప్రతి ఒక్కటి సెన్సేషన్‌గా మారుతూనే ఉంటుంది. ఇక దీంతో పాటు విజయ్ దేవరకొండకుliger;karan johar;sushant singh;puri jagannadh;raj;sushanth;vijay;vijay deverakonda;cinema;arjun reddy;director;lion;hero;joseph vijay;posters;arjun 1;reddy;world famous lover;lion 1;devarakonda;chitram;loverలైగర్ ఏంటన్నా.. విజయ్ దేవరకొండను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లులైగర్ ఏంటన్నా.. విజయ్ దేవరకొండను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లుliger;karan johar;sushant singh;puri jagannadh;raj;sushanth;vijay;vijay deverakonda;cinema;arjun reddy;director;lion;hero;joseph vijay;posters;arjun 1;reddy;world famous lover;lion 1;devarakonda;chitram;loverMon, 18 Jan 2021 12:06:08 GMTఅర్జున్ రెడ్డి చిత్రంతో తన కంటూ తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ఆయన సినిమా పోస్టర్ నుంచి సినిమా విడుదల వరకు ప్రతి ఒక్కటి సెన్సేషన్‌గా మారుతూనే ఉంటుంది. ఇక దీంతో పాటు విజయ్ దేవరకొండకు మొదటి నుంచి ట్రోల్స్ బాధ ఎక్కువగానే ఉంది. గతంలో పలు మార్లు ఆయనపై వచ్చిన అనేక ట్రోల్స్‌పై కూడా విజయ్ స్పందించాడు. అయినప్పటికి నెటిజన్లు విజయ్ దేవరకొండపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. విజయ్ చివరగా తీసిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఈ చిత్ర ఆడియోలో విజయ్ దేవరకొండ స్పీచ్‌పై సినిమా విడుదల తర్వాత నెటిజన్లు ట్రోల్స్ చేశారు.

ఇక ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం వస్తోంది. కొద్ది నిమిషాల క్రితమే ఈ సినిమా పోస్టర్, టైటిల్ విడుదలైంది. ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టింది. లైగర్ అంటే.. లయన్ + టైగర్ అని అర్థం. అంతే కాకుండా సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్‌ను కూడా తగిలించారు. దీంతో నెటిజన్లు విపరీతమైన కామెంట్లు చేయడం మొదలుపెడుతున్నారు. విజయ్ దేవరకొండతో పాటు కరణ్ జోహార్‌ను కూడా ఆడుకుంటున్నారు. ఈ చిత్ర ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ కూడా ఒకరు. ఆయన గే కావడం.. చిత్రానికి క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ పెట్టడంతో ఆయనపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన నాటి నుంచి కరణ్ జోహార్‌పై ఏ విధమైన కామెంట్లు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగానే కరణ్ జోహార్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మరో పక్క విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్ర టైటిల్ ఏ విధంగానూ ఆకట్టుకోవడం లేదంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి లైగర్ చిత్రం విజయ్ దేవరకొండకు, పూరి జగన్నాథ్‌కు మంచి హిట్‌ను ఇవ్వాలని కోరుకుందాం.  


వైసీపీలో దిక్కులేక‌... తిరిగి టీడీపీలోకే వ‌స్తున్నాడుగా...!

ఎన్టీయార్ కెరీర్ లో అదే బ్యాడ్ పీరియడ్...?

జబర్దస్త్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో సీక్రెట్ చెప్పేసిన అప్పారావు

' క్రాక్ ' ఎక్కించిన మాస్‌మ‌హ‌రాజ్‌.. ' క్రాక్ ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌..

కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>