MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla1002ef2b-1ae4-439e-8bf4-357f9ac8ddb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla1002ef2b-1ae4-439e-8bf4-357f9ac8ddb7-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి టీడీపీ పలు నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాలు సాధిస్తోంది. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో శృంగవరపుకోట కూడా ఒకటి. ఇక్కడ 1983,1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఒక్క 2004లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు 11 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి కోళ్ళ లలితకుమారysrcp mla;tiru;jagan;congress;botcha satyanarayana;2019;mla;minister;air;fort;tdp;ycp;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నెగిటివ్‌లోనే ఉన్నారా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నెగిటివ్‌లోనే ఉన్నారా?ysrcp mla;tiru;jagan;congress;botcha satyanarayana;2019;mla;minister;air;fort;tdp;ycp;partyMon, 18 Jan 2021 05:00:00 GMTపార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి టీడీపీ పలు నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాలు సాధిస్తోంది. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో శృంగవరపుకోట కూడా ఒకటి. ఇక్కడ 1983,1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఒక్క 2004లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు 11 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి కోళ్ళ లలితకుమారిపై విజయం సాధించారు.

ఎన్‌ఆర్‌ఐ అయిన కడుబండి...మంత్రి బొత్స సత్యనారాయణకు వీర విధేయుడు. ఆయన చొరవతోనే కడుబండికి 2019 ఎన్నికల్లో శృంగవరపుకోట టిక్కెట్ వచ్చింది. రాష్ట్రమంతా జగన్ గాలి ఉండటం వల్ల టీడీపీ కంచుకోటగా ఉన్న ఎస్ కోటలో కడుబండి విజయం సాధించగలిగారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కడుబండి నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం గగనమని తెలుస్తోంది. ఈయన ఎక్కువగా గజపతినగరంలోనే ఎక్కువ ఉంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా తక్కువ అని టాక్.

అటు అభివృద్ధి పనుల విషయంలో కూడా చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఏ విధంగా చూసిన ఇక్కడ కడుబండిపై ఎక్కువ నెగిటివ్‌గానే ఉందని అంటున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇళ్ల పట్టాలు లాంటి కార్యక్రమాలు ప్లస్ అవుతున్నాయి. అటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతీరాణి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. దీంతో కడుబండికి కాస్త ఇబ్బందికర పరిస్తితి ఉంది.

అయితే ఇక్కడ టీడీపీ కూడా వీక్‌గా ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున కోళ్ళ లలితకుమారి ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా ఉన్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాస్త యాక్టివ్‌గా ఉన్నాసరే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వల్ల వైసీపీకి ప్లస్ ఉంది. కాకపోతే టీడీపీ రూట్ లెవెల్‌లో కూడా బలంగా ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశముంది.




విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>