PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/telangana-govt-decision-on-residential-schoolsb9df6b32-cea7-4680-b75c-a9d1e9059f35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/telangana-govt-decision-on-residential-schoolsb9df6b32-cea7-4680-b75c-a9d1e9059f35-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు కాస్త హాట్ టాపిక్ గా ఉన్నాయి. రాజకీయంగా ఈ అంశం తెలంగాణాలో కాస్త ఇబ్బందికరంగా ఉంది అనే చెప్పాలి. తాజాగా వికారాబాద్ లో బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ పై ప్రశంసల వర్షం‌ కురిపించారు బిజెపి నేత స్వామీగౌడ్. బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ ప్రియ శిష్యుడని పొగడ్తలు కురిపించారు. తెలంగాణ యువకుల హీరో బండి సంజయ్ అని ఆయన వ్యాఖ్యానించారు. దారూసలాంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న మొనగాడు.. మగాడు బండి సంజయ్ అని ఆయన వ్యాఖ్యానింkcr;kcr;varsha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;chief minister;minister;hero;sircilla;varsham;narendraకేసీఆర్ దరిద్రం అంటూ మహిళా నేత సంచలన వ్యాఖ్యలుకేసీఆర్ దరిద్రం అంటూ మహిళా నేత సంచలన వ్యాఖ్యలుkcr;kcr;varsha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;chief minister;minister;hero;sircilla;varsham;narendraMon, 18 Jan 2021 21:15:00 GMTబిజెపి నేతలు చేస్తున్న విమర్శలు కాస్త హాట్ టాపిక్ గా ఉన్నాయి. రాజకీయంగా ఈ అంశం తెలంగాణాలో కాస్త ఇబ్బందికరంగా ఉంది అనే చెప్పాలి. తాజాగా వికారాబాద్ లో బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ పై ప్రశంసల వర్షం‌ కురిపించారు బిజెపి నేత స్వామీగౌడ్.  బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ ప్రియ శిష్యుడని పొగడ్తలు కురిపించారు. తెలంగాణ యువకుల హీరో బండి సంజయ్ అని ఆయన వ్యాఖ్యానించారు. దారూసలాంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న మొనగాడు.. మగాడు బండి సంజయ్  అని ఆయన వ్యాఖ్యానించారు.

పీఆర్సీ ఇవ్వకుండా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి విభజిస్తున్నాడు అని మండిపడ్డారు. పీఆర్సీ అడిగితే కేసీఆర్ భోజనాలు పెడ్తున్నాడు అని ఆయన విమర్శించారు. తన తెలివి తేటలను కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలి అని సూచించారు. 50వేల మంది రోహింగ్యాలను తిప్పిపంపాలని కోరుతున్నా కేసీఆర్ పెడచెవిన పెడ్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ సహా దేశమంతా బీజేపీ వైపు చూస్తోంది అని ఆయన అన్నారు. త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370రద్దు చేసిన మొనగాడు నరేంద్ర మోదీ  అని ఆయన కొనియాడారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ దరిద్రపు, దగుల్బాజీ  ముఖ్యమంత్రి అని అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా.. సీఎం కేసీఆర్ జైల్ జీవతం గడపక తప్పదు అని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  కాపాడుకోవటానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోదీని కలిశాడు అని మండిపడ్డారు. అనేక మంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ దగా చేశాడు అని విమర్శలు చేసారు. డబుల్ బెడ్ రూం, రైతు రుణమాఫీ, నిరుద్యోగులను సైతం కేసీఆర్ మోసం చేశాడు అని అన్నారు. బీజేపీ ఎక్కడుందో.. గజ్వేల్, సిద్ధపేట, సిరిసిల్ల ప్రజలను అడిగితే చెప్తారు అని అన్నారు


ఉత్తరప్రదేశ్ లో ఘోరం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో హెల్త్ వర్కర్ మృతి

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>