PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-politics67fbbf5a-5748-44ff-b0b2-e8096dab0787-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/west-bengal-politics67fbbf5a-5748-44ff-b0b2-e8096dab0787-415x250-IndiaHerald.jpgవెస్ట్ బెంగాల్‌లో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్న బీజేపీకి చెక్ పెట్టేలా మమత అడుగులేస్తున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేయబోతున్నట్లు దీదీ ప్రకటించారు. నందిగ్రామ్.. ఇటీవలే బీజేపీలో చేరిన సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావడం విశేషం. మమతా బెనర్జీకి నమ్మిన బంటులా ఉన్న సువేందు అధికారి.. కొద్ది రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారుmamata benarjee;view;mamata benerjee;benarjee;mamatha;prema;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;congress;రాజీనామా;chief minister;love;assembly;minister;fort;cheque;midnapore;mamta mohandas;partyబీజేపీని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగా తను పోటీ చేసే స్థానం ఖరారు చేసిన దీదీ...బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగా తను పోటీ చేసే స్థానం ఖరారు చేసిన దీదీ...mamata benarjee;view;mamata benerjee;benarjee;mamatha;prema;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;congress;రాజీనామా;chief minister;love;assembly;minister;fort;cheque;midnapore;mamta mohandas;partyMon, 18 Jan 2021 20:30:00 GMTదేశవ్యాప్తంగా అప్పుడే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రస్తావన మొదలైంది. అతి త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, దీదీ మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా వెస్ట్ బెంగాల్‌లో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్న బీజేపీకి చెక్ పెట్టేలా మమత అడుగులేస్తున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేయబోతున్నట్లు దీదీ ప్రకటించారు. నందిగ్రామ్.. ఇటీవలే బీజేపీలో చేరిన సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావడం విశేషం. మమతా బెనర్జీకి నమ్మిన బంటులా ఉన్న సువేందు అధికారి.. కొద్ది రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి.. కమలం గూటికి చేరారు. సోమవారం నందిగ్రామ్ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీ పాల్గొన్న దీదీ.. ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపారు.



‘‘నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలనేది నా కోరిక. నేను భబానీపూర్‌ను నిర్లక్ష్యం చేయను. అక్కడ మంచి అభ్యర్థిని బరిలోకి దింపుతాను. నాకు నందిగ్రామ్ అంటే ఎంతో ప్రేమ. భావోద్వేగాలను నేను నియంత్రించుకోలేపోయా’’ అని దీదీ వ్యాఖ్యానించారు. కొందరు టీఎంసీని వీడటం మంచిదైందంటూ.. సువేందు అధికారిపైమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. కొందరు ఇక్కడి నుంచి అక్కడి వెళ్తుంటారు. మీరేం బాధపడకండి.. తృణమూల్ ఏర్పడినప్పుడు వాళ్లు లేరంటూ ఆమె కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ నేతల బెదిరింపులకు తలొగ్గిన సువేందు ఆ పార్టీలోకి వెళ్లారని దీదీ ఆరోపించారు. నందిగ్రామ్ ప్రాంతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్) ఏర్పాటు చేయాలని భావించింది. ఇండోనేసియాకు చెందిన సలీం గ్రూప్ కోసం పది వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని భావించింది. దీనికి వ్యతిరేకంగా రైతులతో కలిసి మమత ఉద్యమించారు. 2008లో నిర్వహించిన ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల్లో టీఎంసీ అత్యధికంగా 35 స్థానాలను గెలుచుకుంది. ఈ ఉద్యమ ప్రభావంతో 2011 ఎన్నికల్లో నాటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఓడిపోయారు. సింగూరు, నందిగ్రామ్ ఆందోళనల కారణంగా 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు తెరపడి దీదీ సీఎం అయ్యారు. మొత్తానికి త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుండటం విశేషం.




స్థానిక ఎన్నికలపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>