MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-jr-ntrc8205e39-6b75-42b4-b755-c6d11959bbd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-jr-ntrc8205e39-6b75-42b4-b755-c6d11959bbd8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత తరుణ్, శ్రియ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే మూవీ ద్వారా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మంచి సక్సెస్ అందుకుని తొలి సినిమాతో త్రివిక్రమ్ కి సక్సెస్ ని అందించింది. pawan;pawan;cbn;mahesh;ntr;shriya;allu arjun;kalyan;pawan kalyan;rajani;srinivas;tarun;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;smart phone;blockbuster hit;hero;heroine;success;agnyaathavaasi;nandamuri taraka rama rao;arjun 1;gmb entertainments;ala vaikunthapurramloo;tarun kumar;ntr arts;nuvve nuvveమహేష్, పవన్, ఎన్టీఆర్ .... ఏకంగా ముగ్గురినీ లైన్ లో పెట్టాడుగా .....??మహేష్, పవన్, ఎన్టీఆర్ .... ఏకంగా ముగ్గురినీ లైన్ లో పెట్టాడుగా .....??pawan;pawan;cbn;mahesh;ntr;shriya;allu arjun;kalyan;pawan kalyan;rajani;srinivas;tarun;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;smart phone;blockbuster hit;hero;heroine;success;agnyaathavaasi;nandamuri taraka rama rao;arjun 1;gmb entertainments;ala vaikunthapurramloo;tarun kumar;ntr arts;nuvve nuvveMon, 18 Jan 2021 00:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత తరుణ్, శ్రియ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే మూవీ ద్వారా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మంచి సక్సెస్ అందుకుని తొలి సినిమాతో త్రివిక్రమ్ కి సక్సెస్ ని అందించింది.
ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ద్వితీయ విఘ్నన్ని కూడా దిగ్విజయంగా అధిగమించిన త్రివిక్రమ్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగి వాటితో పలు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకంగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమా ఎంత గొప్ప విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక అందులోని సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అతి త్వరలో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక సినిమా తీయనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్తం అతి త్వరలో త్వరలో జరుగనున్నట్లు టాక్. అదిరిపోయే స్టోరీ లైన్ తో అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్మూవీ తీయనున్నారట. ఇక ఈ మూవీ తో పాటు మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కోసం కూడా త్రివిక్రమ్ రెండు పవర్ఫుల్ స్టోరీ లు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇటీవల వారిద్దరినీ కలిసి ఆయన కథలని వినిపించి వారి నుండి ఆమోదం కూడా అందుకున్నారట త్రివిక్రమ్. కాగా పవన్ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుండగా మహేష్ బాబు మూవీ ని ఆ సంస్థతో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా కలిసి నిర్మించనుందట. దాదాపుగా పదేళ్ల గ్యాప్ తరువాత సూపర్ స్టార్ తో సినిమా చేయనుండడంతో ఆ మూవీ కథ విషయమై అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారట త్రివిక్రమ్. అలానే ఇటీవల పవన్ తో తాను తీసిన అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ కావడంతో తదుపరి తాము చేయబోయే సినిమా పక్కాగా సక్సెస్ కొట్టేలా ఆ కథని కూడా సిద్ధం చేశారట. ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్, పవన్, ఎన్టీఆర్ లతో త్రివిక్రమ్ మూడు పక్కా బ్లాక్ బస్టర్ సక్సెస్ మూవీ లను లైన్లో పెట్టారని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ సాధించి త్రివిక్రమ్ కి ఏ మేర పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగకతప్పదు....!!


కాశ్మీర్ ప్రశాంతం.. టెర్రరిస్టులు కూడా...

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>